iPhone 13 Features: ఐఫోన్‌ 13లో కనిపించని పాపులర్ ఆండ్రాయిడ్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?

iPhone vs Android: ఐఫోన్ 13 సిరీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో రానున్న ఈ నూతన ఐఫోన్స్.. ఫీచర్లన్నీ ముందే తెలిసిపోయాయి.

iPhone 13 Features: ఐఫోన్‌ 13లో కనిపించని పాపులర్ ఆండ్రాయిడ్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?
Follow us
Venkata Chari

|

Updated on: Sep 16, 2021 | 11:50 AM

iPhone vs Android: ఐఫోన్ 13 సిరీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో రానున్న ఈ నూతన ఐఫోన్స్.. ఫీచర్లన్నీ ముందే తెలిసినా.. సెప్టెంబర్ 14 న జరిగిన ఈవెంట్‌లో కీనోట్ సమయంలో ఆపిల్ కీలక విషయాలను ప్రస్తావించింది. ఎప్పటిలాగే, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కొన్ని ఫీచర్లు కనిపిస్తాయని అనుకున్నారు. కానీ, ఈసారి ఆపిల్ వినియోగదారులకు షాకిచ్చింది.ఆండ్రాయిడ్ ఫోన్లలో కనిపించే కొన్ని ఫీచర్లు.. ఐఫోన్‌లో మాత్రం కనిపించవు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే.. ఐఫోన్ 13 విడుదల అనగానే అంతా.. అందులో ఓ ఫీచర్ కోసం ఎదురుచూశారు. దీనిపై పుకార్లు కూడా బాగానే వచ్చాయి. అదే ఉండే డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండడం. కానీ, ఆపిల్ సంస్థ ఈ ఫీచర్‌ను స్కిప్ చేసింది. ఇప్పటికే ఈ ఫీచర్ శాంసన్, గూగుల్, షియోమీ లాంటి ఇతర ప్రముఖ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో సందడి చేస్తోంది.

నాచ్ లెస్ డిస్‌ప్లే నాచ్ చిన్నదైనా.. పెద్దదైనా కానీ, ఐఫోన్ 13 లో మాత్రం నాచ్ డిస్‌ప్లేతోనే విడుదలైంది. కానీ, అంతా నాచ్ డిస్‌ప్లే లేకుండా విడుదలవుతుందనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే శాంసన్, గూగుల్, వన్ ప్లస్ ఫోన్లలో ఫుల్ డిస్‌ప్లే అందించారు. గూగుల్ ఫిక్సెల్ 5 ఫోన్ ఫుల్ డిస్‌ప్లేతో విడుదల కాగా, వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్లు కూడా ఇలానే విడుదల అయ్యాయి. అయితే ఐఫోన్ 13లో నాచ్ డిస్‌ప్లే ఇవ్వడానికి కారణం మాత్రం ఫేస్ ఐడీతోపాటు ఇతర సెన్సార్‌ల కోసమే అని తెలుస్తోంది. ఇతర ఫోన్లతో పోల్చితే.. ఫేస్‌ ఐడీ ఐఫోన్లలో చాలా ఖచ్చతత్వంతో పనిచేయడమే ఓ కారణమని తెలుస్తోంది.

రివర్స్ వైర్‌లెస్ ఛార్జింజ్ ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ అలరిస్తోంది. కానీ, ఇంతవరక ఐఫోన్లలో ఈ ఫీచర్ లేదు. కొత్తగా విడుదలయ్యే ఫోన్లలో రివర్స్ ఛార్జింగ్ అందిస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఈ ఫీచర్‌ని కూడా ఆపిల్ పక్కన పెట్టేసింది.

యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు యూఎస్‌బీ టైప్ సీ తో విడుదల కావడం లేదు. టైప్ సీ కేబుల్‌తో మ్యాక్ బుక్ లేదా ఐప్యాడ్ ప్రో లేదా ఎయిర్ ప్యాడ్ వంటి వాటిని ఛార్జ్ చేసేందుకు సాధ్యపడుతుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నీ ఈ ఫీచర్‌తో విడులయ్యాయి. ఐఫోన్ 13 ను మాత్రం లైటినింగ్ కేబుల్‌తో మాత్రమే ఛార్జ్ చేయగలం.

Also Read: Zoom App: జూమ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్‌..12 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్‌.. ఎప్పటి నుంచి అందుబాటులో అంటే..

వచ్చేస్తోంది యమహా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌..! ధర R15 V3 కంటే తక్కువే.. ఎప్పుడు లాంచ్‌ అవుతుందంటే..?