వచ్చేస్తోంది యమహా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌..! ధర R15 V3 కంటే తక్కువే.. ఎప్పుడు లాంచ్‌ అవుతుందంటే..?

uppula Raju

uppula Raju |

Updated on: Sep 15, 2021 | 9:32 PM

Yamaha: మీకు స్పోర్ట్స్ బైక్‌ అంటే ఇష్టమా.. దానికోసం ఎక్కువగా ఖర్చు చేయలేరా.. అయితే కొద్ది రోజులు వేచి చూడండి. ఎందుకంటే యమహా మోటార్ ఇండియా మీ

వచ్చేస్తోంది యమహా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌..! ధర R15 V3 కంటే తక్కువే.. ఎప్పుడు లాంచ్‌ అవుతుందంటే..?
Yamah Yzf R15

Follow us on

Yamaha: మీకు స్పోర్ట్స్ బైక్‌ అంటే ఇష్టమా.. దానికోసం ఎక్కువగా ఖర్చు చేయలేరా.. అయితే కొద్ది రోజులు వేచి చూడండి. ఎందుకంటే యమహా మోటార్ ఇండియా మీ అభిరుచికి తగిన విధంగా స్పోర్ట్స్ బైక్‌ విడుదల చేయనుంది. ధర పరంగా చూసినా ఇతర స్పోర్ట్స్ బైక్‌ల కంటే కూడా చాలా తక్కువ. ఒక్కసారి ఈ బైక్‌ ఫీచర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి యమహా కొత్త బైక్‌ను సెప్టెంబర్ 21న విడుదల చేయబోతోంది. ఈ బైక్ YZF-R15M అని అంటున్నారు. ఇది R15 అప్‌గ్రేడ్ మోడల్‌గా కనిపిస్తుంది. అయితే ఈ బైక్ గురించి కంపెనీ ఇంకా ఏమీ ప్రకటించలేదు. కానీ ఈ బైక్ అనేక చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ బైక్ డీలర్‌షిప్‌లలో కూడా కనిపించింది.

యమహా కొత్త బైక్ ఫీచర్లు బైక్ పూర్తిగా భిన్నంగా ఉండనుంది. కొత్త సింగిల్ పాడ్ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. అలాగే LED DRLలు కూడా అందిస్తున్నారు. బైక్ ట్యాంక్ చాలా పటిష్టంగా వస్తుంది. టెయిల్ ల్యాంప్‌లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. LED DRL లు మాత్రమే కాకుండా LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు కూడా బైక్‌లో ఉంటాయి. ఇది మాత్రమే కాదు యమహా వై-కనెక్ట్ యాప్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఖరీదు ధర గురించి మాట్లాడితే ఇది భారతీయ కస్టమర్ల మనస్తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. గతంలో R15 V3 ధర 1.5 లక్షల రూపాయల కంటే కొంచెం ఎక్కువగా ఉండేది. అయితే కొత్తగా వచ్చే బైక్‌ కూడా స్పోర్ట్స్ బైక్‌గా అందిస్తున్నారు. కానీ ధర తక్కువగా ఉంటుంది. కంపెనీ YZF-R15 ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించవచ్చని తెలుస్తోంది. ఈ బైక్ ఈ ధర పరిధిలో KTM RC125 తో పోటీపడనుంది.

CUCET Admit Card 2021: సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి..

IPL 2021: ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లు వీరే..! డేంజర్ బ్యాట్స్‌మెన్స్

Gas Cylinder Prices: సామాన్యులకు భారీ షాక్‌..!! మరింత పెరగనున్న గ్యాస్‌.. వీడియో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu