Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS IT Policy: భారీ పెట్టుబడులే లక్ష్యం.. ఐటీలో రాష్ట్రాన్ని నెంబర్-1గా నిలపడమే టార్గెట్.. తెలంగాణలో రెండో ఐటీ పాలసీ విడుదల

భారీ పెట్టుబడులే లక్ష్యం. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని నెంబర్-1గా నిలపడమే టార్గెట్. తెలంగాణలో రెండో ఐటీ పాలసీ రిలీజ్ అయింది. స్టార్టప్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌లకు రాష్ట్రం మొదటి ఛాయిస్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్.

TS IT Policy: భారీ పెట్టుబడులే లక్ష్యం.. ఐటీలో రాష్ట్రాన్ని నెంబర్-1గా నిలపడమే టార్గెట్.. తెలంగాణలో రెండో ఐటీ పాలసీ విడుదల
Telangana New It Policy
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 16, 2021 | 4:53 PM

TS New ICT Policy: భారీ పెట్టుబడులే లక్ష్యం. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని నెంబర్-1గా నిలపడమే టార్గెట్. తెలంగాణలో రెండో ఐటీ పాలసీ రిలీజ్ అయింది. స్టార్టప్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌లకు రాష్ట్రం మొదటి ఛాయిస్‌గా మారిందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. హైదరాబాద్‌లోని HICCలో రెండో ఐటీ పాలసీని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్‌. పాత పాలసీకి 5 సంవత్సరాలు పూర్తవడంతో కొత్త పాలసీని ప్రకటించారు. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ కార్యక్రమంలో నాస్కామ్‌ చైర్మన్‌ రేఖ మీనన్‌, ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు. నూతన ఐటీ పాలసీ 2026 వరకు అమల్లో ఉండనుంది. స్పాట్…

ఏడేళ్లలో తెలంగాణలో తలసరి ఆదాయం దాదాపు రెట్టింపయిందన్నారు మంత్రి కేటీఆర్. జాతీయ సగటు కంటే ఇది ఎక్కువన్నారు. ఐటీ ఎగుమతులు కూడా రెండింతలు అధికమయ్యాయని వెల్లడించారు. 2013-14లో రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2020-21 నాటికి రూ.లక్షా 45 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలో బెస్ట్ ఫైవ్ కంపెనీస్ హైదరాబాద్‌లో తమ ఆఫీస్‌లను ఏర్పాటు చేశాయని ఆయన గుర్తు చేశారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ అని మంత్రి పేర్కొన్నారు. ఏ టెక్నాలజీ అయినా ప్రజల అవసరాలను తీర్చేలా ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్తుంటారని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణను సాంకేతిక పరిశ్రమలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. టెక్నాలజీ ఆధారిత పాలనకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. డ్రైవింగ్‌ లెసెన్స్‌ టెస్ట్‌ కూడా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. 15 వందల స్టార్టప్‌లకు సహాయం అందించామని, టాస్క్‌ ద్వారా 3 లక్షల మందికి పైగా నిపుణులను తయారు చేశామని వెల్లడించారు. 5 వందలకు పైగా ప్రభుత్వ సేవలు మీ సేవ ద్వారా అందిస్తున్నామన్నారు. ఏ టెక్నాలజీ అయినా సామాన్య ప్రజల అవసరాలను తీర్చేలా ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్తుంటారని గుర్తుచేశారు. డ్రైవింగ్‌ లెసెన్స్‌ టెస్ట్‌ కూడా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టెక్నాలజీ పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని 5 లక్షల మందికిపైగా డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అందించామన్నారు. ప్రైవేటు కంపెనీలతో కలిసి రూ.13 వందల కోట్లతో స్టార్టప్‌లను పోత్సహిస్తున్నామన్నారు. ప్రధాన ఐటీ కంపెనీలు రాష్ట్రంలోని టైర్‌-1, టైర్‌-2 సిటీలపై కూడా దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో 40 స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు.

Read Also… Bullettu Bandi Song: గుంటూరులో ‘బుల్లెట్‌ బండి’ సందడి.. పారిశుద్ధ్య కార్మికుల డ్యాన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.