Metro: వాట్సాప్‌లో మెట్రో టికెట్ బుకింగ్ చాలా సింపుల్‌.. ఇలా చేయండి..

కేవలం మెసేజింగ్‌ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వాట్సాప్‌ ఏఐ బాట్‌ ఆధారిత మెట్రో టికెట్‌ బుకింగ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సేవలను ఇప్పటికే హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, పుణె నగరాల్లో అందుబాటులోకి తీసుకుగారాగా తాజాగా ఈ సేవలను నాగ్‌పూర్‌కు సైతం విస్తరించారు...

Metro: వాట్సాప్‌లో మెట్రో టికెట్ బుకింగ్ చాలా సింపుల్‌.. ఇలా చేయండి..
Metro Ticket In Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 21, 2024 | 7:06 AM

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొంగొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకర్షిస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌. ముఖ్యంగా భద్రతకు పెద్ద పీట వేస్తూ ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ మరెన్నో ఫీచర్లను పరిచయం చేస్తోంది.

కేవలం మెసేజింగ్‌ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వాట్సాప్‌ ఏఐ బాట్‌ ఆధారిత మెట్రో టికెట్‌ బుకింగ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సేవలను ఇప్పటికే హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, పుణె నగరాల్లో అందుబాటులోకి తీసుకుగారాగా తాజాగా ఈ సేవలను నాగ్‌పూర్‌కు సైతం విస్తరించారు. ఇంతకీ వాట్సాప్‌లో మెట్రో టికెట్ ఎలా బుక్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్‌ల మెట్రో టికెట్‌ సేవలు తెలుగుతో పాటు ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ ప్రజలు మెట్రో టికెట్ బుక్‌ చేసుకోవాలనుకుంటే 8341146468 నెంబర్‌కు ‘Hi అని మెసేజ్‌ చేయాలి. అదే నాగ్‌పూర్ ప్రయాణికులు 8624888568 నెంబర్‌కు మెసేజ్‌ పంపాల్సి ఉంటుంది. లేదా వాట్సాప్‌లో వచ్చే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినా సరిపోతుంది. ఇక వాట్సాప్‌లో క్విక్‌ పర్చేజ్‌ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు.

రెగ్యులర్‌గా మెట్రోలో ప్రయాణం చేసే వారి కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే రూట్లను సేవ్‌ చేసుకోవడం ద్వారా టికెట్‌ బుకింగ్‌ను సులభతరం చేసుకోవచ్చు. దీంతో టికెట్‌ను వేగంగా బుక్‌ చేసుకోవచ్చు. ప్రతీసారి గమ్యస్థానాలు, స్టార్టింగ్ పాయింట్లను సెలక్ట్ చేసుకోవాల్సి అవసరం ఉండదు. ఇక వాట్సాప్‌ ద్వారా ఒకే సమయంలో ఆరు సింగిల్ జర్నీ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అలాగే ప్రతి లావాదేవీకి 40 మంది ప్రయాణికులకు గ్రూప్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..