HMD Global: జనాల ‘పల్స్’ పట్టిన స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు రెడీ.. పూర్తి వివరాలు..

మన దేశీయ మార్కెట్లోకి తన తొలి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ఇటీవల గ్లోబల్ వైడ్ గా హెచ్ఎండీ పల్స్, పల్స్ ప్లస్, పల్స్ ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని ఇప్పుడు మన దేశంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ప్లాట్ ఫారంపై వెల్లడించింది.

HMD Global: జనాల ‘పల్స్’ పట్టిన స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు రెడీ.. పూర్తి వివరాలు..
Hmd Global Pluse Series Smartphones
Follow us

|

Updated on: May 02, 2024 | 3:30 PM

నోకియా బ్రాండ్ ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు ఓన బ్రాండింగ్ తో లాంచ్ చేస్తోంది. ఇటీవల కొన్ని దేశాల్లో హెచ్ఎండీ గ్లోబల్ నుంచి స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే మన దేశీయ మార్కెట్లోకి తన తొలి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ఇటీవల గ్లోబల్ వైడ్ గా హెచ్ఎండీ పల్స్, పల్స్ ప్లస్, పల్స్ ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని ఇప్పుడు మన దేశంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ప్లాట్ ఫారంపై వెల్లడించింది. భారత దేశంలో తమ ఫోన్లు లాంచ్ చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా హెచ్ఎండీ గ్లోబల్ అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఆ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హెచ్ఎండీ పల్స్ సిరీస్ ఫోన్ల స్పెసిఫికేషన్లు..

హెచ్ఎండీ పల్స్.. ఈ ఫోన్లో 6.65 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, 720పీ ప్లస్ రిజల్యూషన్ ఉంటుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. యూనిసొక్ టీ606 చిప్ సెట్, ఆక్టాకోర్ ప్రాసెసర్ యూనిట్, మాలీ జీ57 ఎంపీఐ జీపీయూ ఉంటుంది. 4జీబీ లేదా 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 13ఎంపీ వెనుకవైపు కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీల కోసం ఉంటుంది.

హెచ్ఎండీ పల్స్ ప్లస్.. ఈ ఫోన్లో డిస్ ప్లే, చిప్ సెట్, మెమరీ వివరాలు స్టాండర్డ్ మోడల్ అంటే హెచ్ఎండీ పల్స్ లో ఉన్నట్లే ఉంటాయి. అయితే వెనుకవైపు కెమెరా మాత్ర 50ఎంపీ ఉంటుంది. ముందు వైపు మాత్రం 8ఎంపీ కెమెరానే కొనసాగించారు. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఉంటుంది.

హెచ్ఎండీ పల్స్ ప్రో.. దీనిలో 6.65 అంగుళాల 90హెర్జ్ డిస్ ప్లే ఉంటుంది. యూనిసోక్ టీ606 చిప్ సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే 2ఎంపీ డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది. 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

  • ఈ మూడు మోడళ్లలో మన దేశంలో లాంచ్ అవుతున్న మోడల్ ఏదో కంపెనీ ప్రకటించలేదు. వీటిల్లో ఏదో ఒకటి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..