AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఈవెంట్‌లను ప్లాన్‌ చేసుకునేందుకు

ముఖ్యంగా గ్రూప్‌ మెసేజ్‌లను టార్గెట్ చేసుకొని ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్‌ మెసేజ్‌లలో ఈవెంట్‌లను ప్లాన్‌ చేయడానికి ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ సహాయంతో గ్రూప్‌లో ఉన్న సభ్యులకు వ్యక్తిగత సమావేశాలను సెటప్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇమెయిల్ ద్వారా ఆహ్వానాలను పంపే వివిధ ‘ఇ-వైట్’ సేవలు అందుబాటులో...

WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఈవెంట్‌లను ప్లాన్‌ చేసుకునేందుకు
Whatsapp
Narender Vaitla
|

Updated on: May 02, 2024 | 2:09 PM

Share

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను పెంచుకుంటూ పోతోంది రోజురోజుకీ లేటెస్ట్ ఫీచర్లను అప్‌గ్రేడ్‌ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో యూజర్‌ ఇంటర్‌ ఫేజ్‌తో పాటు పలు ఆసక్తికర ఫీచర్లను పరిచయం చేసింది వాట్సాప్‌. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ముఖ్యంగా గ్రూప్‌ మెసేజ్‌లను టార్గెట్ చేసుకొని ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్‌ మెసేజ్‌లలో ఈవెంట్‌లను ప్లాన్‌ చేయడానికి ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ సహాయంతో గ్రూప్‌లో ఉన్న సభ్యులకు వ్యక్తిగత సమావేశాలను సెటప్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇమెయిల్ ద్వారా ఆహ్వానాలను పంపే వివిధ ‘ఇ-వైట్’ సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ అచ్చంగా ఇవైట్‌లాగే పనిచేస్తుంది. వాట్సాప్‌ గ్రూప్‌లో ఉండే సభ్యుల పుట్టిన రోజు పార్టీలు, లేదా ఏదైనా మీటింగ్‌లను సెటప్‌ చేసుకోవచ్చు. ఈవెంట్ క్రియేట్‌ చేయగానే గ్రూప్‌ ఇన్ఫర్మేషన్‌ పేజీకి పిన్ అయి ఉంటుంది. అలాగే గ్రూప్ చాట్ థ్రెడ్‌ క్రియేట్‌ అవుతుంది. దీంతో ఎవరెవరికీ మెసేజ్‌ చేరిందో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈవెంట్‌కు వచ్చేవారు రిప్లయ్‌ ఇచ్చి కన్ఫర్మ్‌ చేయొచ్చు.

అలాగే గ్రూప్‌లో ఉన్న సభ్యులకు మీటింగ్ సమయానికి నోటిఫికేషన్‌ కూడా వెళ్తుంది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను వాట్సప్‌ కమ్యూనిటీలలోని గ్రూప్‌లకు తీసుకొస్తున్నారు. అనంతరం అన్ని గ్రూప్‌లకు ఈ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లను సైతం వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో చాట్‌ ఫిల్టర్‌, థీమ్‌ కలర్‌ చేంజ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్