Whatsapp Update: వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. ఇక ఆ అధికారం అడ్మిన్స్‌దే..!
ఇటీవల వాట్సాప్‌లో ఓ కొత్త అప్‌డేట్ అందరినీ ఆకర్షస్తుంది. ముఖ్యంగా వాట్సాప్‌లో మనం ఏర్పాటు చేసుకునే గ్రూప్స్‌లో కాంటాక్ట్ జోడింపు అంశాన్ని తాజాగా అడ్మిన్స్‌కే అప్పగించేలా ఓ అప్‌డేట్ వచ్చింది,. మెటా యాజమాన్యంలోని విస్తృతంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కమ్యూనిటీ అడ్మినిస్ట్రేటర్‌ల నియంత్రణను పెంచే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఈ తాజా అప్‌డేట్‌లో ప్లాట్‌ఫారమ్ కమ్యూనిటీ అడ్మిన్‌లకు తమ కమ్యూనిటీలకు సభ్యులను ఎవరు జోడించవచ్చో నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తోంది.

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడంతో వాటిల్లో వచ్చే కొన్ని యాప్స్‌ను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతంలో మెసేజ్ పంపాలంటే కేవలం ఫోన్‌లో ఉండే మెసేజ్ సౌకర్యంతోనే అయ్యేది. కానీ స్మార్ట్‌ఫోన్స్ వచ్చాక వాట్సాప్ అత్యంత ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా మేసేజ్‌లను పొందడమే కాకుండా ఆడియో, వీడియో మెసేజ్‌లు, డాక్యుమెంట్స్ పంపే సౌలభ్యం ఉంది. అంతే కాకుండా పేమెంట్స్‌తో పాటు ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పించడంతో యువత ఎక్కువగా వాట్సాప్‌ను వాడుతున్నారు. అయితే ఇటీవల వాట్సాప్‌లో ఓ కొత్త అప్‌డేట్ అందరినీ ఆకర్షస్తుంది. ముఖ్యంగా వాట్సాప్‌లో మనం ఏర్పాటు చేసుకునే గ్రూప్స్‌లో కాంటాక్ట్ జోడింపు అంశాన్ని తాజాగా అడ్మిన్స్‌కే అప్పగించేలా ఓ అప్‌డేట్ వచ్చింది,. మెటా యాజమాన్యంలోని విస్తృతంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కమ్యూనిటీ అడ్మినిస్ట్రేటర్‌ల నియంత్రణను పెంచే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఈ తాజా అప్‌డేట్‌లో ప్లాట్‌ఫారమ్ కమ్యూనిటీ అడ్మిన్‌లకు తమ కమ్యూనిటీలకు సభ్యులను ఎవరు జోడించవచ్చో నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తోంది. వాట్సాప్ తాజా అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
వాట్సాప్ తాజా అప్‌డేట్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.23.18.20 అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటా ద్వారా పరిచయం చేశారు. ఈ అప్‌డేట్‌తో వాట్సాప్ కమ్యూనిటీ అడ్మిన్‌లకు మరింత నియంత్రణను అందించే అదనపు ఎంపికను అందిస్తోంది. పలు నివేదికల ప్రకారం కొత్త కమ్యూనిటీ సెట్టింగ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. కమ్యూనిటీకి సభ్యులను జోడించే అధికారాన్ని ఎవరికి కలిగి ఉందో కమ్యూనిటీ నిర్వాహకులు నిర్ణయించడానికి అనుమతిస్తుంది. డిఫాల్ట్‌గా ఈ చర్య కమ్యూనిటీ అడ్మిన్‌లకు పరిమితం చేశారు. వారికి మాత్రమే కొత్త సభ్యులను నేరుగా జోడించడానికి వీలు కల్పిస్తుంది. అయితే గ్రూప్ నిర్వాహకులు ఈ అధికారాన్ని ఇతరులకు ఇవ్వాలని కోరుకుంటే దాని అనుమతించే అవకాశం ఉంటుందని టెక్ నిపుణులు పేర్కంటున్నారు. అలాంటి సందర్భాల్లో వారు “ఆల్” అనే ఎంపికను ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ కమ్యూనిటీ అడ్మిన్‌ల కోసం గణనీయమైన మెరుగుదలని సూచిస్తుంది. వారికి వారి సమూహాలు, కమ్యూనిటీ సభ్యులపై అధిక సౌలభ్యాన్ని, నియంత్రణను అందిస్తుంది.
వాట్సాప్ తాజా అప్ ఇది గ్రూప్ అడ్మిన్‌లు నేరుగా సభ్యులను ఎవరు జోడించవచ్చో ఎంచుకోవడానికి అనుమతించే అదనపు నియంత్రణ అని నిపుణులు వివరిస్తున్నారు. కమ్యూనిటీ అడ్మిన్ రూపొందించిన చెల్లుబాటు అయ్యే కమ్యూనిటీ ఆహ్వాన లింక్‌ని కలిగి ఉంటే ప్రతి ఒక్కరూ ఇప్పటికీ కమ్యూనిటీకి సభ్యులను జోడించగలరు. ఈ కొత్త ఎంపిక కమ్యూనిటీ ఆహ్వాన లింక్ అవసరం లేకుండా కూడా తమ కమ్యూనిటీలకు కొత్త సభ్యులను మాన్యువల్‌గా జోడించే వారిని నియంత్రించడానికి కమ్యూనిటీ నిర్వాహకులకు అధికారం ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఈ తాజా అప్‌డేట్ వాట్సాప్ బీటా అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసే ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఇది ఆదరణ పొందితే మరికొన్ని రోజుల్లోనే ఈ సదుపాయం అందరికీ అందుబాటులోకి వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..





