అరుణ గ్రహం లో వింత శబ్దాలు, నాసా రోవర్ తొలిసారిగా రికార్డు చేసిన సరికొత్త ఆడియో ట్రాక్

అంగారక గ్రహంలో రోజుకో కొత్త వింతలు జరుగుతున్నాయి. కనీవినీ ఎరుగని విచిత్రాలు తెలుస్తున్నాయి. నాసా సంస్థ ప్రయోగించిన పర్సేవెరెన్స్ రోవర్ ఈ గ్రహంలో వింత శబ్దాలను రికార్డు చేసింది....

అరుణ గ్రహం లో వింత శబ్దాలు, నాసా రోవర్ తొలిసారిగా రికార్డు చేసిన సరికొత్త ఆడియో ట్రాక్
New Sounds From Mars
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 08, 2021 | 10:56 AM

అంగారక గ్రహంలో రోజుకో కొత్త వింతలు జరుగుతున్నాయి. కనీవినీ ఎరుగని విచిత్రాలు తెలుస్తున్నాయి. నాసా సంస్థ ప్రయోగించిన పర్సేవెరెన్స్ రోవర్ ఈ గ్రహంలో వింత శబ్దాలను రికార్డు చేసింది. జెజెరో అనే క్రేటర్ (గొయ్యి) మీదుగా ఇది వెళ్తుండగా హెలికాఫ్టర్ పైని బ్లేడ్స్ (ఫలకాలు) తిరుగుతున్న మెల్లని శబ్దాలను ఇది క్యాప్చర్ చేయగలిగింది. గ్రహంపై 262 మీటర్ల ఎత్తున రోవర్ వెళ్తున్నప్పుడు ఈ విచిత్రం జరిగింది. సెపరేట్ స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్షనౌక) చేసిన ధ్వనులుగా కూడా ఇవి ఉన్నాయని నాసా ట్వీట్ చేసింది. కానీ ఇవి చాలా ‘లో’ (తక్కువ) స్థాయిలో వినిపించాయట. ఈ గ్రహం మీది వాతావరణం భూగ్రహం మీదిడెన్సిటీ కన్నా సుమారు ఒక శాతం తక్కువేనని, , దీనివల్ల భూమిపైకి కన్నా శబ్దాలు చాలా మెల్లగా వినబడుతాయని నాసా ఇంజనీర్లు తెలిపారు. ఇది అత్యంత ఆశ్చర్యకరమని ఏరోనాటికల్ స్పేస్ విభాగం ప్రొఫెసర్ డేవిడ్ మిమౌన్ అంటున్నారు. రోవర్ లోని సూపర్ కామ్ లేసర్ ఓ వైపు ఈ గ్రహం మీది శిలలను క్యాప్చర్ చేయగా ఇప్పుడు ఈ రోవర్ లోని మైక్రోఫోన్ ఈ ధ్వనులను రికార్డు చేయగలిగింది. అరుణ గ్రహం పైని వాతావరణాన్ని, అక్కడ మానవుల ఆవాసాలకు అవకాశాలు ఉన్నాయా అన్న విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఈ కొత్త వింతలు తోడ్పడుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

అంగారక గ్రహంపై వినిపించిన శబ్దాలు సెకండుకు దాదాపు 240 మీటర్లని అంచనా వేశారు. కానీ భూ గ్రహం పైని శబ్దాలు సెకండుకు 340 మీటర్లని తెలుస్తోంది. 96 శాతం కార్బన్ డై ఆక్సయిడ్ వాతావరణంతో తో కూడిన అరుణ గ్రహం ఎక్కువ స్థాయి ధ్వనులను క్యాచ్ చేయగలదని, అదే సమయంలో తక్కువ స్థాయి ధ్వనులు చాలా దూరం వరకు ప్రయాణిస్తాయని నాసా ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే ‘మోనో’ లో రికార్డు చేసిన ఆడియోను హెలికాఫ్టర్ బ్లేడ్స్ పిచ్ ని ఐసొలేట్ చేయడం ద్వారా నాసా పెంచగలిగింది.ఏమైనా ఈ గ్రహం మీద ధ్వనులను క్యాప్చర్ చేయడం ఇది మొట్టమొదటిసారి కాగా . ఏలియన్స్ ఉన్నారా అనడానికి కూడా ఈ స్టడీ తోడ్పడుతోంది.

మరిన్ని చదవండి ఇక్కడ : ఊరు ఊరంతా ఐసోలేషన్‌!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral video.

బాబాయ్ , బోయపాటి సినిమాలో అబ్బాయి నందమూరి ఫ్యాన్స్‌కు పండగే ! : Kalyan Ram In Balakrishna Movie Video.