AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple: మార్కెట్లోకి యాపిల్‌ కొత్త ప్రొడక్ట్స్‌.. నేడు లాంచింగ్‌కు సర్వం సిద్ధం..

ఐపోన్‌ 15 సిరీస్‌ను లాంచ్‌ చేసిన యాపిల్‌ ఐప్యాడ్‌ను మాత్రం తీసుకురాలేదు. 13 ఏళ్ల చరిత్రలో.. ఏడాదిలో ఒక్క ఐప్యాడ్‌ ప్రొడక్ట్ కూడా తీసుకురాకుండా లేదు. అయితే తాజా ఇప్పుడు ఏకంగా మూడు డివైజ్‌లను యాపిల్‌ లాంచ్‌ చేయనుంది. ఐప్యాడ్‌ మినీ, ఐప్యాడ్ ఎయిర్‌ (ఎం2 అప్‌గ్రేడ్‌) లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక 2022 అక్టోబర్​లో ఎం2 పవర్డ్​ ఐప్యాడ్​ ప్రోతో పాటు 10వ జెనరేషన్​ ఐప్యాడ్​ని సైతం లాంచ్​ చేసింది...

Apple: మార్కెట్లోకి యాపిల్‌ కొత్త ప్రొడక్ట్స్‌.. నేడు లాంచింగ్‌కు సర్వం సిద్ధం..
Apple Products
Narender Vaitla
|

Updated on: Oct 17, 2023 | 8:00 AM

Share

Apple iPad Air, iPad mini, and 11th Gen iPad: యాపిల్‌ సంస్థ నుంచి ఏదైనా కొత్త బ్రాండ్‌ వస్తుందంటే ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యావత్ ప్రపంచ టెక్‌ మార్కెట్‌లో యాపిల్ ప్రొడక్ట్స్ సందడి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త ఐప్యాడ్ డివైజ్‌లను తీసుకొస్తోంది. ఈరోజు (మంగళవారం) కొత్త గ్యాడ్జెట్స్‌ను లాంచ్‌ చేయనుంది.

ఐపోన్‌ 15 సిరీస్‌ను లాంచ్‌ చేసిన యాపిల్‌ ఐప్యాడ్‌ను మాత్రం తీసుకురాలేదు. 13 ఏళ్ల చరిత్రలో.. ఏడాదిలో ఒక్క ఐప్యాడ్‌ ప్రొడక్ట్ కూడా తీసుకురాకుండా లేదు. అయితే తాజా ఇప్పుడు ఏకంగా మూడు డివైజ్‌లను యాపిల్‌ లాంచ్‌ చేయనుంది. ఐప్యాడ్‌ మినీ, ఐప్యాడ్ ఎయిర్‌ (ఎం2 అప్‌గ్రేడ్‌) లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక 2022 అక్టోబర్​లో ఎం2 పవర్డ్​ ఐప్యాడ్​ ప్రోతో పాటు 10వ జెనరేషన్​ ఐప్యాడ్​ని సైతం లాంచ్​ చేసింది. ఈరోజు ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ఎయిర్‌, ఐప్యాడ్ 11వ జెన్‌ లాంచ్‌ అవుతాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఐప్యాడ్స్‌ ఫీచర్స్‌కి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందించలేదు. అయితే ప్రాసెసర్‌లో అప్‌గ్రేడ్స్‌ ఉంటాయని సమాచారం. ఎం3 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌ని యాపిల్ అభివృద్ధి చేస్తోంది. ఐప్యాడ్ ఎయిర్లో ఎం2 అప్‌గ్రేడ్‌, ఐప్యాడ్‌ మినీలో ఏ16 ఎస్‌ఓసీ ఉండొచ్చని అంచనావేస్తున్నారు. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌లో ఈ ప్రాసెసర్‌ను అందించారు.

ఇదిలా ఉంటే యాపిల్ తన ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసే సమయంలో వండర్‌లస్ట్ పేరుతో భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఐప్యాడ్‌ లాంచ్‌కు సంస్థ పెద్దగా హడావుడి చేసే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణ ప్రెస్‌ రిలీజ్‌తోనే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే.

అయితే ఐప్యాడ్‌ బేస్‌ మోడల్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే బయటకొచ్చింది. కంపెనీ కూడా కొన్ని అప్‌గ్రేడ్‌లతో దీన్ని లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఐప్యాడ్‌ను కంపెనీ గతేడాది చివరిగా అప్‌డేట్ ఇచ్చింది. 10వ తరం ఐప్యాడ్‌లో డిజైన్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. టచ్‌ ఐడీ బటన్‌కు కంపెనీ సపోర్ట్‌ చేస్తోంది. 11వ తరం ఐప్యాడ్లో ఏ16 చిప్‌సెట్‌ను అందించనున్నట్లు సమాచారం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..