మార్స్ పై నీటి జాడను కనుగొన్న నాసా… ఇక సేఫ్ లాండింగ్ కోసం సెర్చింగ్..!

నాసా తన వ్యోమగాములను అంగారక గ్రహానికి పంపడానికి సురక్షిత ల్యాండింగ్ ప్రదేశాలను కనుగొనే ప్రయత్నంలో ఉంది. మార్స్ గ్రహం మీద మంచు ప్రదేశాలను కనుగొన్నట్లు నాసా తెలిపింది. మార్స్ గ్రహం మీద మంచు నిక్షేపాలు ఉపరితలం కంటే ఒక అంగుళం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. “ఈ మంచును త్రవ్వటానికి మీకు బ్యాక్‌హో అవసరం లేదు. మీరు పారను ఉపయోగించవచ్చు” అని కాలిఫోర్నియాలోని నాసా పరిశోధనా సంస్థ సిల్వైన్ పిక్యూక్స్ ఒక వార్తా ప్రకటనలో తెలిపింది. 2008 నుండి […]

మార్స్ పై నీటి జాడను కనుగొన్న నాసా... ఇక సేఫ్ లాండింగ్ కోసం సెర్చింగ్..!
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2019 | 1:45 AM

నాసా తన వ్యోమగాములను అంగారక గ్రహానికి పంపడానికి సురక్షిత ల్యాండింగ్ ప్రదేశాలను కనుగొనే ప్రయత్నంలో ఉంది. మార్స్ గ్రహం మీద మంచు ప్రదేశాలను కనుగొన్నట్లు నాసా తెలిపింది. మార్స్ గ్రహం మీద మంచు నిక్షేపాలు ఉపరితలం కంటే ఒక అంగుళం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. “ఈ మంచును త్రవ్వటానికి మీకు బ్యాక్‌హో అవసరం లేదు. మీరు పారను ఉపయోగించవచ్చు” అని కాలిఫోర్నియాలోని నాసా పరిశోధనా సంస్థ సిల్వైన్ పిక్యూక్స్ ఒక వార్తా ప్రకటనలో తెలిపింది.

2008 నుండి అంగారక గ్రహంపై నీటి మంచు ఉందని మాకు తెలుసు అని నాసా పరిశోధకుడు లెస్లీ టాంపారి ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గత కొద్ధి సంవత్సరాలుగా బహుళ అంతరిక్ష నౌకలతో అంగారక గ్రహాన్ని పరిశీలించడం వల్ల..  ఈ మంచును కనుగొనే కొత్త మార్గాలను తెలుసుకుంటున్నాము. ఈ మంచు పొరలు రెడ్ ప్లానెట్ ఉపరితలం క్రింద 2.5 సెంటీమీటర్లు (ఒక అంగుళం) తక్కువగా ఉన్నాయి, కాబట్టి ల్యాండింగ్ ప్రదేశాల కోసం ఏజెన్సీకి ఇప్పటికే అనేక ఎంపికలు ఉన్నాయి. ఏది ఏమయినప్పటికీ 2030 కు ముందు మానవ సహిత అంగారక యాత్ర చేపట్టకపోవచ్చు అని లెస్లీ తెలిపారు.

[svt-event date=”14/12/2019,1:09AM” class=”svt-cd-green” ]

[/svt-event]