మరోసారి కొత్త వర్షన్స్‌తో కనెక్ట్‌ అవుతున్న నోకియా..

నోకియా.. కనెక్టింగ్ ది పీపుల్. ఇది ఆ ఫోన్ కంపెనీ నినాదం. భారత్‌లో తొలుత నోకియా అంటే ఓ బ్రాండ్‌గా ఉండేది. ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులు ఇదే ఫోన్ ఉపయోగించేవారు. అయితే ఆ తర్వాత.. మొబైల్ రంగంలో వచ్చిన విప్లవంలో నోకియా ప్రజల నుంచి కాస్త దూరమయ్యింది. దీనికి కారణం స్మార్ట్‌ ఫోన్ల వాడకం ఎక్కువైనప్పటి నుంచి ఈ ఫోన్ తన కస్టమర్లను ఆకర్షించలేకపోయింది. అయితే తాజాగా ఇప్పుడు.. మరోసారి కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. కంపెనీ […]

మరోసారి కొత్త వర్షన్స్‌తో కనెక్ట్‌ అవుతున్న నోకియా..
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 13, 2019 | 7:03 PM

నోకియా.. కనెక్టింగ్ ది పీపుల్. ఇది ఆ ఫోన్ కంపెనీ నినాదం. భారత్‌లో తొలుత నోకియా అంటే ఓ బ్రాండ్‌గా ఉండేది. ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులు ఇదే ఫోన్ ఉపయోగించేవారు. అయితే ఆ తర్వాత.. మొబైల్ రంగంలో వచ్చిన విప్లవంలో నోకియా ప్రజల నుంచి కాస్త దూరమయ్యింది. దీనికి కారణం స్మార్ట్‌ ఫోన్ల వాడకం ఎక్కువైనప్పటి నుంచి ఈ ఫోన్ తన కస్టమర్లను ఆకర్షించలేకపోయింది. అయితే తాజాగా ఇప్పుడు.. మరోసారి కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. అయితే ఇది ఇప్పట్లో భారత్‌లోకి ప్రవేశించలేదు. “ఆండ్రాయిడ్ గో” ఎడిషన్‌లో నోకియా సీ1 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అత్యంత తక్కువ ధరలోనే ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. భారత్‌లో దీని ధర.. కేవలం రూ.4000 లోపే అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఫోన్‌లో 3జీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక మిగతా ఫీచర్స్ చూస్తే.. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16 జీబీ, 2,500ఎంఏహెచ్ బ్యాటరీ, 5మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 9 పై (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభ్యంకానుంది. తక్కువ బడ్జెట్‌లో బేసిక్ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఇది కనెక్ట్ అయ్యేలా ఉంది.