AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాలి నుంచి తాగునీరు.. చాలా చీపు గురూ..!

వర్షపు నీరు, భూగర్భ జలాలే కాకుండా తాజాగా గాలినీరు కూడా అందుబాటులోకి వచ్చింది. అవును మీరు విన్నది నిజమే..తాజాగా నీటిని గాలితో శుభ్రం చేసిన స్వచ్చమైన తాగునీరు దేశంలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి వచ్చింది.. గాలి నుండి నీటిని తీయటం ఏమిటి అని చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాని ఇది సాధ్యమే అని సికింద్రాబాద్ రైల్వే అధికారులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ […]

గాలి నుంచి తాగునీరు.. చాలా చీపు గురూ..!
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Dec 13, 2019 | 6:22 PM

Share
వర్షపు నీరు, భూగర్భ జలాలే కాకుండా తాజాగా గాలినీరు కూడా అందుబాటులోకి వచ్చింది. అవును మీరు విన్నది నిజమే..తాజాగా నీటిని గాలితో శుభ్రం చేసిన స్వచ్చమైన తాగునీరు దేశంలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి వచ్చింది.. గాలి నుండి నీటిని తీయటం ఏమిటి అని చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాని ఇది సాధ్యమే అని సికింద్రాబాద్ రైల్వే అధికారులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ‘అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్ ’కియోస్క్ ఏర్పాటు చేశారు.

గాలిని వడపోత వ్యవస్థ ద్వారా యంత్రంలోకి పంపించి, తేమతో నిండి ఉన్న కలుషితాలను ఫిల్టర్ చేస్తుంది. తర్వాత శుభ్రపరిచిన గాలిని ఒక గదిలోకి పంపబడుతుంది. అక్కడ గాలి ఘనీకృత రూపంలో ఉంటుంది. అలా ఉన్న గాలి నీటిగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా గాలి నుంచి నీటిని తయారు చేస్తారు. ఈ పద్ధతి ద్వారా  తయారైన నీరు సురక్షితమైనది అని జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ పద్ధతి ద్వారా రోజుకు 1000 లీటర్ల నీరు ఉత్పత్తి జరుగుతుంది. ప్రయాణికులు తమ సొంత బాటిల్ తీసుకువస్తే లీటరకు రూ.5, లేకుంటే లీటరకు రూ.8 వసూలు చేస్తున్నారు. కాగా, ఇటువంటి  కియోస్క్ ఏర్పాటుకు కృషి చేసిన జోన్ అధికారులను, సిబ్బందిని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజనన్ మాల్యా ప్రశంసించారు. త్వరలో ఇతర రైల్వే స్టేషన్ ల్లలో కూడా ఈ నీరు అందుబాటులోకి తీసుకురావటానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు.