Largest Comet: అతి పెద్ద తోకచుక్కను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దాని పొడవు తెలిస్తే ఉలిక్కిపడతారు!
ఇప్పటివరకు కనుక్కున్న తోకచుక్కల్లో కెల్లా అతిపెద్ద తోకచుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి కామెట్ C/2014 UN271 అని పేరు పెట్టారు. 137 కిలోమీటర్ల పొడవున్న ఈ తోకచుక్కను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి పెడ్రో బెర్నెడినెల్లి .. ఖగోళ శాస్త్రవేత్త గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు.
Largest Comet: ఇప్పటివరకు కనుక్కున్న తోకచుక్కల్లో కెల్లా అతిపెద్ద తోకచుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి కామెట్ C/2014 UN271 అని పేరు పెట్టారు. 137 కిలోమీటర్ల పొడవున్న ఈ తోకచుక్కను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి పెడ్రో బెర్నెడినెల్లి .. ఖగోళ శాస్త్రవేత్త గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు. వారి పేరుతో దీనిని బెర్నెడినెల్లి-బెర్న్‌స్టెయిన్ కామెట్ అని పిలుస్తారు. మన సౌరకుటుంబంలో ఇది అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్క పరిమాణాన్ని లెక్కించేందుకు శాస్త్రవేత్తలు చిలీలోని సెర్రో-టోలోలో ఇంటర్-అమెరికానో వద్ద డార్క్ ఎనర్జీ కెమెరాను ఉపయోగించారని ది సన్‌లోని ఒక నివేదిక పేర్కొంది. ప్యారిస్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఇమ్మాన్యుయెల్ లెలౌచ్ మాట్లాడుతూ, దీని పొడవు 100 కిలోమీటర్లు ఉంటుందని ముందుగా భావించారు. కానీ తరువాత అది 137 కిలోమీటర్లుగా అంచనా వేశారు. ఈ తోకచుక్క భూమి.. సూర్యుని మధ్య దూరం కంటే 20 రెట్లు ఎక్కువగా వెళుతుంది. తోకచుక్క సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి దాదాపు 5.5 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇది దాదాపు ఒక కాంతి సంవత్సరం దూరంలో సూర్యుని నుంచి చాలా దూరం ప్రయాణిస్తుంది.
ఊర్ట్ క్లౌడ్ నుంచి కామెట్, హార్వర్డ్‌కు ఈ తోకచుక్కను అధ్యయనం చేయడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఇది మాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది మంచు క్షేత్రం ఉన్న కామెట్ ఊర్ట్ క్లౌడ్ (కామెట్ .. ధూళితో కూడిన భారీ మేఘం) నుంచి ఉద్భవించింది అని వారు చెప్పారు. పీటర్ చెబుతున్న దాని ప్రకారం, ఈ కామెట్ వెనుక ఒక మందమైన తోక ఉంటుంది, ఇది దుమ్ము లేదా ఒక రకమైన ఆవిరి లేదా వాయువు, కానీ అధ్యయనంలో ఇది రసాయనికంగా జడమైనదిగా తెలుస్తోంది. ఇటువంటి పదార్ధాలతో తోకలు తయారు అవడం అసాధ్యం. అయితే, తరువాత అధ్యయనంలో మన సౌర వ్యవస్థలో ఒక తోకచుక్క ప్రయాణించినప్పుడు, సూర్యుని వేడి .. సౌర గాలుల ఘర్షణ కారణంగా వాటి తోక ఏర్పడుతుందని కూడా స్పష్టం అయింది.
తొలిసారిగా 2014 సంవత్సరంలో..
శాస్త్రవేత్తలు దీనిని మొదటిసారిగా 2014 సంవత్సరంలో కనుగొన్నారు. ఆ తర్వాత 2015, 2016, 2017, 2018లో కంటిన్యూగా కనిపించింది. టెలిస్కోప్ ద్వారా వీక్షించినప్పుడు, ఈ తోకచుక్క నీలిరంగు బిందువుగా కనిపించింది, ఇది భూమి వైపు వస్తున్నట్లు కనిపించింది. అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తలు తమ నివేదికను దాని అధ్యయనం కోసం మైనర్ ప్లానెట్ సెంటర్‌కు పంపారు, తద్వారా ఈ కామెట్ భూమి వైపు వచ్చే చిన్న గ్రహం కాదని కనుగోన్నారు. ఈ తోకచుక్క జనవరి 2031న మన సూర్యునికి అత్యంత సమీపంలోకి చేరుకుంటుంది .. ఆ సమయంలో దాని దూరం భూమి నుంచి సూర్యుని దూరం కంటే 11 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Also Read: Prince Charles: ప్రిన్స్ ఛార్లెస్‌కు రెండోసారి కరోనా.. ఐసోలేషన్‌లోకి బ్రిటన్ యువరాజు..
Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది దుర్మరణం..