Motorola Flip Phones: మోటోరోలా నుంచి మడతపెట్టే ఫోన్లు.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిదే.. పూర్తి వివరాలు ఇవి..

మోటోరోలా సరికొత్త ఫీచర్లతో ఫ్లిప్ ఫోన్లను లాంచ్ చేసింది. మోటో రాజ్ ఆర్ 40 అల్ట్రా, మోటా రాజ్ ఆర్ 40 పేర్లతో వీటిని ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొబైల్స్ కంటే భిన్నంగా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ డిజైన్ తో వచ్చాయి.

Motorola Flip Phones: మోటోరోలా నుంచి మడతపెట్టే ఫోన్లు.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిదే.. పూర్తి వివరాలు ఇవి..
Moto Razr Flip Phone
Follow us

|

Updated on: Jun 03, 2023 | 5:00 PM

టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల ట్రెండ్ మొదలైంది. ఈ విభాగంలో ఇప్పటికే శామ్సంగ్ గేలాకీ, ఒప్పో వంటి సంస్థలు తమ ఉత్పత్తులు లాంచ్ చేశాయి. ఇప్పుడు వీటికి పోటీగా మోటోరోలా సరికొత్త ఫీచర్లతో ఫ్లిప్ ఫోన్లను లాంచ్ చేసింది. మోటో రాజ్ ఆర్ 40 అల్ట్రా, మోటా రాజ్ ఆర్ 40 పేర్లతో వీటిని ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొబైల్స్ కంటే భిన్నంగా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ డిజైన్ తో వచ్చాయి. వీటిలో బ్యాక్ ప్యానెల్ పైన సెకండరీ డిస్ ప్లే ఉంది. వీటకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మోటో రోలా రాజ్ఆర్ 40 అల్ట్రా..

దీనిలో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటుంది. అలాగే 3.6-అంగుళాల సెకండరీ డిస్ ప్లే, 12ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. అలాగే ఐపీ52 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

మోటోరోలా రాజ్ఆర్ 40..

దీనిలో 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ఫ్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. అలాగే 1.5-ఇంచ్ సెకండరీ డిస్ ప్లే ఉంటుంది, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 64ఎంపీ డ్యూయల్-కెమెరా సెటప్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 8 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మోటో రాజ్ఆర్ 40, మోటో రాజ్ఆర్ 40 అల్ట్రా ధర, లభ్యత..

  • మోటో రాజ్ఆర్ 40 అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర CNY 3,999 (రూ.46,400) గా ఉంది. 8జీబీ/12జీబీ, 256జీబీ స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 4,299 (సుమారు రూ.49,900) , CNY 4,699 (సుమారు రూ.54,600) గా ఉంది.
  • మోటోరాజ్ఆర్ 40 అల్ట్రా డివైజ్ ఇన్‌ఫినిట్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, వివా మజెంటా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజీ ధర CNY 6,499 (సుమారు రూ.75,400) గా ఉంది. ఈ డివైజ్ సేల్ చైనాలో జూన్ 5 నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..