Moonquakes: భూమి కంపిస్తే భూకంపం.. మరి చంద్రుడు కంపిస్తే.. ఏం జరుగుతుంది..?
Shrinking Moon Causing Moonquakes: భూమ్మీద అత్యంత వినాశనం కల్గించే ప్రకృతి వైపరీత్యం భూకంపం. భారత్‌లో ఉత్తరాదిన తరచుగా ఈ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్ల కదిలికల కారణంగానే ఈ భూకంపాలు సంభవిస్తాయన్న సంగతి తెలిసిందే. భూమి లోపలి పొరల్లో అత్యంత ఉష్ణోగ్రత ఉంటుందని, చిక్కటి ద్రవరూపంలో ఉన్న ఆ భాగంపై అనేక పొరలు ఉంటాయని చదువుకున్నాం.

Shrinking Moon Causing Moonquakes: భూమ్మీద అత్యంత వినాశనం కల్గించే ప్రకృతి వైపరీత్యం భూకంపం. భారత్‌లో ఉత్తరాదిన తరచుగా ఈ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్ల కదిలికల కారణంగానే ఈ భూకంపాలు సంభవిస్తాయన్న సంగతి తెలిసిందే. భూమి లోపలి పొరల్లో అత్యంత ఉష్ణోగ్రత ఉంటుందని, చిక్కటి ద్రవరూపంలో ఉన్న ఆ భాగంపై అనేక పొరలు ఉంటాయని చదువుకున్నాం. వాటిపై తేలియాడే భూమి పైపొరల్లో (టెక్టానిక్ ప్లేట్లు) కదలికలు, ఘర్షణ కారణంగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సరిగ్గా ఇదే తరహా పరిస్థితి భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడిపై కూడా ఉంది. ఆ కారణంగా అక్కడ కూడా కంపనాలు, ప్రకంపనాలు సంభవిస్తూ ఉంటాయి. వాటిని ఇంగ్లిష్‌లో మూన్‌క్వేక్స్ అంటారు. అంటే మనం చంద్రకంపాలు అనుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. చంద్రుడిపై వివిధ దేశాలు చేస్తున్న పరిశోధనల్లో సరికొత్త విషయం వెలుగుచూసింది. అదేంటంటే.. చంద్రుడు క్రమక్రమంగా కుంచించుకుపోతున్నాడు. అవును.. చంద్రుడి లోపలి భాగం చల్లబడుతోంది. ఆ కారణంగా చంద్రుడు ఉపరితలనం నుంచి కొద్దికొద్దిగా కుంచించుకుపోతున్నాడు. దీంతో చంద్రుడి ఉపరితలంపై ముడతలు ఏర్పడి, అక్కడి చంద్రగోలిక (చంద్రుడి ఉపరితల) స్వరూపం మారిపోతోంది. క్రస్ట్ ఎగుడుదిగుడుగా మారడంతో గండికోటను తలపించే క్లిఫ్ (నిట్టనిలువు లోయ)లు ఏర్పడుతున్నాయి.
చంద్రుడు కుంచించుపోవడం వల్ల చంద్రకంపాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తించడంతో పాటు ఆందోళనకు కారణమవుతోంది. ఎందుకంటే.. చంద్రుడి ఉపరితలంపై భారత్ సహా అనేక దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఏర్పడుతున్న మార్పులను బట్టి అక్కడి టెక్టానిక్ ప్లేట్లు చాలా చురుగ్గా కదులుతున్నాయని అర్థమవుతోంది. చంద్రగోళంపై స్థిరమైన పరిస్థితులు లేవని, అత్యంత క్రియాశీలంగా.. ఇంకా చెప్పాలంటే అస్థిరంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. అక్కడికి చేరుకునే వ్యోమగాములకు పరిచయం లేని వాతావరణ పరిస్థితుల నుంచే కాదు, చంద్రకంపాల ముప్పు కూడా పొంచి ఉంది. ఈ మధ్యనే ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన “టెక్టానిక్స్ అండ్ సీస్మిసిటీ ఆఫ్ ది లూనార్ సౌత్ పోలార్ రీజియన్” అనే పరిశోధనాపత్రనంలో అంశాలను పేర్కొన్నారు.
థామస్ ఆర్ వాట్టర్స్ నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలో ఇంకా అనేక ఆసక్తికరం, ఆందోళన కల్గించే అంశాలున్నాయి. లక్షల సంవత్సరాల కాలం పాటు సాగిన ప్రక్రియలో చంద్రుడు 150 అడుగుల మేర కుంచించుకుపోయినట్టు గుర్తించారు. ఈ క్రమంలో తరచుగా చంద్రకంపాలు ఏర్పడుతున్నాయని, వాటిలో కొన్ని ఓ మోస్తరు తీవ్రత కల్గినవేనని అంచనా వేస్తున్నారు. చంద్రుడిపై పరిశోధనల కోసం అక్కడికి మానవసహిత స్పేస్‌షిప్‌లను పంపించాని భావించేవారు అక్కడ ఏర్పడే చంద్రకంపాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని కూడా ఈ పరిశోధనాపత్రం చెబుతోంది. దాన్ని బట్టి ల్యాండింగ్ సైట్ నిర్ణయించుకోవడం, సురక్షిత ప్రాంతంలో వ్యోమగాముల ఆవాసాలు ఏర్పాటు చేయడానికి ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




