Vastu Tips: ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? ఈ తప్పులు చేశారంటే నాశనమే..!
ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు తప్పనిసరి.. ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో వివిధ గదులు నిర్మించేటప్పుడు, ఇంట్లో వస్తువులను ఉంచేటప్పుడు కూడా వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే, ఇంట్లో ఆనందం, శాంతి, ఆరోగ్యం ఉండవని కూడా నమ్ముతారు. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొని ఉండాలన్నా, ప్రతికూల శక్తి ఉండకూడదనుకుంటే తప్పనిసరిగా వాస్తు నియమాలను పాటించాలి. ఈ విషయంలో ఈ రోజు మనం ఇంటి వంటగదిలో చెత్త డబ్బా ఉంచవచ్చా? వాస్తు ఏం చెబుతుంది? ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం...

ఇంట్లో సానుకూల శక్తి, ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉండాలంటే వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతిదీ సరిగ్గా ఉండాలి. చాలా మంది వాస్తు శాస్త్ర నియమాలు తెలియకుండా తప్పులు చేస్తుంటారు. రోజువారీ జీవితంలో వాస్తుపై శ్రద్ధ చూపరు. అతి ముఖ్యమైన విషయం పరిశుభ్రత. ఇంటి శుభ్రత విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయరాదు. ఇంట్లోని కొన్ని ముఖ్యమైన భాగాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలి. అలా చేయకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. ఇంట్లో ఆనందం, సంపద ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలో ఇక్కడ చూద్దాం…
వంటగదిలో చెత్తబుట్టను ఉంచవద్దు:
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో చెత్తబుట్ట ఉంచడం అశుభం. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుందని, అన్నపూర్ణ దేవికి కోపం తెప్పిస్తుందని అంటారు. చెత్త అంటే వ్యర్థం. వంటగది అంటే అన్నపూర్ణ దేవి నివసించే ప్రదేశం. కాబట్టి, చెత్తబుట్ట పొరపాటున కూడా మీ వంటగదిలో ఉంచకూడదు.
చెడు ప్రభావం:
వంటగదిలో చెత్త డబ్బాను ఉంచడం వల్ల ఇంటి వాతావరణం, సంబంధాలు, మానసిక ప్రశాంతత ప్రభావితం అవుతాయి. ఇది ఇంట్లో ఆరోగ్యాన్ని పెంపొందించదు. అయితే, మీరు ఖచ్చితంగా వంటగదిలో చెత్త డబ్బాను ఉంచాలంటే, పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి.
సరైన దిశలో ఉంచాలి:
డస్ట్‌బిన్‌ను ఇంటికి దక్షిణం లేదా నైరుతి మూలలో ఉంచాలి. అలాగే, డస్ట్‌బిన్‌ను ఇంటికి ఉత్తర దిశలో ఉంచకూడదు. దీనివల్ల పేదరికం, గొడవలు, మానసిక అశాంతి కలుగుతాయి.
పూజా మందిరానికి దూరంగా ఉంచాలి:
మీరు చెత్తబుట్టను పూజా మందిరానికి దూరంగా ఉంచాలి. ప్రధాన ద్వారం దగ్గర ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది.
వంట గదిలో చెత్త డబ్బా పెట్టొచ్చు. కానీ, దానికి కచ్చితంగా మూత ఉండాలి. లేదంటే, అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని వ్యాపిస్తుంది. ముఖ్యంగా వంటగది లో ఉంచినప్పుడు కచ్చితంగా దానిమీద మూత ఉండేలా చూసుకోండి. లేదంటే, ఇది మీ ఆహారంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఓపెన్ చెత్తబుట్ట నుండి వెలువడే వాసన , బ్యాక్టీరియా వంటగదిలోని ఆహారాన్ని కలుషితం చేస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్, అలెర్జీలు , ఇతర వ్యాధుల సంభావ్యతను పెంచుతుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




