Microsoft Windows 10: ఒక్క నిర్ణయం.. స్క్రాప్‌గా మారనున్న 24 కోట్ల కంప్యూటర్లు! షాక్‌లో టెక్ ప్రపంచం!
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్ని కంప్యూటర్లు ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తున్నాయో తెలుసా? అక్షరాల 24 కోట్ల కంప్యూటర్లు. కెనాలిస్ రీసెర్చ్ రిపోర్టే కనుక నిజమైతే ఇవన్ని చెత్తకుప్పలో పడేసుకోవాల్సిందే. కెనాలిస్ రిపోర్టు చెబుతున్న దాని ప్రకారం 2025 అక్టోబర్ వరకూ విండోస్ 10కు మద్దతు ఇవ్వాలని, ఈ తర్వాత నిలిపివేయాలని నిర్ణయించింది. ఇదే జరిగితే ఆ వెర్షన్ కు అప్ డేట్లు నిలిచిపోతాయి.
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుందా? తన వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కెనాలిస్ రీసెర్చ్ అనే సంస్థ తన తాజా రిపోర్టులో ప్రకటించింది. ఇప్పుడు ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న వ్యక్తిగత కంప్యూటర్లు వినియోగిస్తున్న వారిని టెన్షన్ పెడుతోంది. ఇదే కనుక నిజమైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న విండోస్ 10 కంప్యూటర్లన్నీ స్క్రాప్ గా మారిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్ని కంప్యూటర్లు ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తున్నాయో తెలుసా? అక్షరాల 24 కోట్ల కంప్యూటర్లు. కెనాలిస్ రీసెర్చ్ రిపోర్టే కనుక నిజమైతే ఇవన్ని చెత్తకుప్పలో పడేసుకోవాల్సిందే. కెనాలిస్ రిపోర్టు చెబుతున్న దాని ప్రకారం 2025 అక్టోబర్ వరకూ విండోస్ 10కు మద్దతు ఇవ్వాలని, ఈ తర్వాత నిలిపివేయాలని నిర్ణయించింది. ఇదే జరిగితే ఆ వెర్షన్ కు అప్ డేట్లు నిలిచిపోతాయి. అప్పుడు సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. డేటాకు భద్రత ఉండదు. దీంతో వినియోగదారులు వాటిని పక్కన పెట్టేసి కొత్త కంప్యూటర్ కొనుగోలు చేసుకోవడం మినహా వేరే ఆప్షన్ ఉండదు.
రెండు దఫాలుగా..
మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఓస్ ను పూర్తిగా నిలిపివేస్తున్న క్రమంలో వినియోగదారులకు 2025 అక్టోబర్ వరకూ ఉచితంగా సెక్యూరిటీ అప్ డేట్లు పొందుకొనే వెసులుబాటును మైక్రోసాఫ్ట్ ఇవ్వనుంది. ఆ తర్వాత మాత్రం కొంత మేర చార్జీలు వసూలు చేయనున్నట్లు చెబుతున్నారు. అలా 2028 వరకూ మూడేళ్ల పాటు ఆ పాత కంప్యూటర్లనే వినియోగించుకునే అవకాశం ఇస్తుందని.. ఆ తర్వాత మాత్రం అంటే 2028 అక్టోబర్ తర్వాత మాత్రం పూర్తిగా విండోస్ 10 ఓఎస్ మంగళం పలకాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించినట్లు సమాచారం. అలా చేయడం వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ కు సెక్యూరిటీ అప్ డేట్లు లేక, వైరస్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సిస్టమ్ పనితీరు పడిపోతుంది.
48 కోట్ల కంప్యూటర్లు ఇక చెత్తలోకే..
మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు ఇప్పుడు ఈ-వేస్ట్ గా మారిపోయే ప్రమాదం ఉందని కెనాలిస్ రీసెర్చ్ సంస్థ చెబుతోంది. ఈ ఈ-వేస్ట్ మొత్తం బరువు దాదాపు 3.2లక్షల కార్ల బరువుతో సమానంగా ఉంటుందని అంచనా వేస్తోంది. దీని కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంగా ఈ-వేస్ట్ కారణంగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతోంది. ఇది మానవాళితో పాటు జంతు, జీవజాలంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. అయితే ఈ-వేస్ట్ ను ప్రత్యామ్నాయ మార్గాల్లో వినియోగించుకోవచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. పీసీల్లో వాడే హార్డ్ డ్రైవ్, డేటా స్టోరేజీ సర్వర్లను రీసైక్లింగ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్లలో వినియోగించే సామగ్రిని తయారు చేయొచ్చని చెబుతున్నారు. బ్యాటరీల తయారీకి కూడా వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..