Maruti Celerio 2021: మారుతీ సుజుకీ సెలెరియో 2021 బుకింగ్స్ షురూ..!
మారుతీ సుజుకీ సెలెరియో విడుదలకు ముందే బుకింగ్‌లు మొదలయ్యాయి. ఎంపిక చేసిన డీలర్ల వద్ద కొత్త మోడల్ కోసం బుకింగ్‌ల స్వీకరణలు ప్రారంభమయ్యాయి.
Maruti Celerio 2021: మారుతీ సుజుకీ ఇండియా కొత్త తరం సెలెరియో మార్కెట్‌లోకి రానుంది. వాస్తవానికి ఈ మోడల్ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కోవిడ్-19 సెకండ్ వేవ్ తో ఆలస్యమైంది. కొత్త సెలెరియో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వినియోగదారుల చెంతకు రానుంది. అయితే మారుతీ సుజుకీ సెలెరియో విడుదలకు ముందే బుకింగ్‌లు మొదలయ్యాయి. ఎంపిక చేసిన డీలర్ల వద్ద కొత్త మోడల్ కోసం బుకింగ్‌ల స్వీకరణలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు రూ .5 వేల నుంచి రూ .11 వేల మధ్యలో బుకింగ్ కోసం చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయో మాత్రం వెల్లడించలేదు. సెప్టెంబర్‌లో వినియోగదారుల చెంతకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి సుజుకి సెలెరియో 2021 ను కంపెనీ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ హియర్టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు అప్‌డేటెడ్ డిజైన్ తో పాటు అత్యాధునిక ఫీచర్లతో రానుంది. పాత తరం మోడల్ తో పోల్చితే చాలా పెద్దదిగా ఉంటుందని లీకైన ఫొటోలతో అర్థమవుతోంది. అలాగే రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లు, బంపర్‌లతో విడుదల కానుంది.
కొత్త తరం సెలెరియో ఎక్కువ వీల్‌బేస్ తోపాటు మెరుగైన క్యాబిన్ స్థలం అందించనుంది. ఈ కొత్త తరం హ్యాచ్‌బ్యాక్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, రెండు చివర్లలో రీడిజైన్ చేసిన బంపర్‌లు ఉండనున్నాయని అంటున్నారు. లోపల క్యాబిన్ లేఅవుట్‌ని పూర్తిగా మార్చినట్లు లీకైన ఫొటోలతో స్పష్టమవుతోంది. లేటెస్ట్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో తోపాటు ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే మారుతి సుజుకి స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తోపాటు నూతన డాష్‌బోర్డ్ లేఅవుట్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ లాంటి అత్యాధునిక ఫీచర్లు అందించనున్నారు.
పాత తరం సెలెరియోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68 బీహెచ్‌పీ పవర్‌తో పాటు 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, కొత్త సెలెరియోలో పెద్ద 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బీహెచ్‌పీ శక్తితో పాటు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేయనుంది. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫైవ్-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కొత్త వేరియంట్ లభించనుంది. ఈ సెకండ్ జనరేషన్ సెలెరియో 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్‌లనూ పెట్రోల్-సీఎన్‌జీ మోడల్స్‌ను అందిచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సేఫ్టీ విషయంలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్(యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ విభాగంలో టాటా టియాగో, హ్యుందాయ్ శాంత్రో, రెనో క్విడ్ లాంటి ఇతర కంపెనీల మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుందని అనుకుంటున్నారు.
Also Read:
Bumper Offer: బైక్‌లు, స్కూటర్లపై రూ. 28,000 తగ్గింపు.. కొత్త రేట్లు వివరాలు ఇలా ఉన్నాయి..
TATA HBX: టాటా నుంచి కొత్త ఎస్‌యూవీ; క్రెటా, సెల్టోస్‌తో పోటీకి సిద్ధమంటోన్న టాటా