Vivo Y51A: 6జీబీ ర్యామ్‌తో వివో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

వివో 6జీబీ ర్యామ్‌తో కొత్త ఫోన్‌ను మార్కెట్ లోకి విడుదల చేసింది. వివో వై51ఏ పేరుతో కొత్త వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేసింది.

Vivo Y51A: 6జీబీ ర్యామ్‌తో వివో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Vivo Y51a 6gb
Follow us
Venkata Chari

|

Updated on: Jun 29, 2021 | 11:57 AM

Vivo Y51A: వివో 6జీబీ ర్యామ్‌తో కొత్త ఫోన్‌ను మార్కెట్ లోకి విడుదల చేసింది. వివో వై51ఏ పేరుతో కొత్త వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేసింది. వివో వై51ఏ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇండియాలో జనవరిలోనే విడుదల అయింది. అయితే ప్రస్తుతం 6జీబీ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. ఈ ఫోన్ ధర రూ.16,990గా కంపెనీ నిర్ణయించింది. జనవరిలో విడుదల చేసిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,990గా ఉన్నవిషయం తెలిసిందే. కాగా, ఈ ఫోన్ రెండు రంగుల్లో లభించనుంది. టైటానియం సఫైర్, క్రిస్టల్ సింఫనీ కలర్స్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పేటీయం, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఫన్‌టచ్ ఓఎస్ 11తో విడుదలైంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌లో కొన్ని మార్పులు చేసి ఫన్ టచ్ ఓఎస్‌ను తయారు చేశారు. 6.58 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేతో విడుదలైన ఈ ఫోన్‌లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌ ను అందించారు. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ఈఫోన్‌లో ఉండగా, మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చని వివో తెలిపింది.

ఇందులో బ్యాక్‌ సైడ్‌ మూడు కెమెరాల సెటప్ ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ లతో అందించారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను ఉంచారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌ 18W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, బ్లూటూత్ 5.0, కనెక్టివిటీ ఫీచర్లతో అలరించనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్క భాగంలో అందించారు.

Also Read:

Maruti Celerio 2021: మారుతీ సుజుకీ సెలెరియో 2021 బుకింగ్స్‌ షురూ..!

Redmi 10 Series: రెడ్‌ మీ 10 సీరిస్‌ మొబైల్‌ వచ్చేస్తోంది.. ట్విట్టర్‌ ఖాతాలో వీడియో విడుదల

Telegram Features: వాట్సాప్‌కు గ‌ట్టి పోటీనిచ్చే దిశ‌గా టెలిగ్రామ్ అడుగులు.. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో అప్‌డేట్‌..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే