Samsung Google: చేతులు కలిపిన శామ్‌సంగ్, గూగుల్.. అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ కోసమే..
Samsung Google: ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం చూసుకోవడానికి ఉపయోగించే ఒక వస్తువు. కానీ స్మార్ట్ యుగంలో వాచ్‌ల స్టైల్ కూడా మారిపోయింది. స్మార్ట్ వాచ్‌ల రాకతో అంతా స్మార్ట్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే...
Samsung Google: ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం చూసుకోవడానికి ఉపయోగించే ఒక వస్తువు. కానీ స్మార్ట్ యుగంలో వాచ్‌ల స్టైల్ కూడా మారిపోయింది. స్మార్ట్ వాచ్‌ల రాకతో అంతా స్మార్ట్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే స్మార్ట్ వాచ్‌లపై వినియోగదారుల్లోనూ ఆసక్తి బాగా పెరుగుతోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి టెక్ దిగ్గజాలు. ఇప్పటికే చాలా కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
తాజాగా మార్కెట్లోకి మరో అద్భుత స్మార్ట్ వాచ్‌ని తీసుకొచ్చేందుకు గాను టెక్ దిగ్గజాలు శామ్‌సంగ్, గూగుల్ చేతులు కలిపాయి. ఈ నూతన స్మార్ట్ వాచ్‌కు సంబంధించిన వివరాలను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో శామ్‌సంగ్ వెల్లడించింది. శామ్‌సంగ్ ఇప్పటికే పలు స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసినప్పటికీ ఇప్పుడు గూగుల్ సహాయంతో తీసుకొస్తున్న ఈ వాచ్‌లో గూగుల్ రూపొందించిన యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తున్నారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లతో వాచ్‌ను మరింత సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త స్మార్ట్ వాచ్‌లో అధునాతన ఫీచర్లను జోడిస్తున్నారు. మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసే యాప్‌లు ఆటోమెటిక్‌గా స్మార్ట్ వాచ్‌లోనూ డౌన్‌లోడ్ అయ్యేలా రూపొందించారు. ఇక బ్యాటరీ సామర్ధ్యాన్ని కూడా పెంచనున్నారు. క్లాక్ బ్లాక్ అనే మరో కొత్త ఫీచర్‌ను ఇందులో పరిచయం చేయనున్నారు. ఆగస్టులో ఈ స్మార్ట్ వాచ్‌ను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Vivo Y51A: 6జీబీ ర్యామ్‌తో వివో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Maruti Celerio 2021: మారుతీ సుజుకీ సెలెరియో 2021 బుకింగ్స్ షురూ..!
Redmi 10 Series: రెడ్ మీ 10 సీరిస్ మొబైల్ వచ్చేస్తోంది.. ట్విట్టర్ ఖాతాలో వీడియో విడుదల