LML Scooter: సూపర్ లుక్ తో ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే మతిపోతుందంతే..!

ఇటీవల నిర్వహించిన ఆటో ఎక్స్ పో 2023 లో ఈ బైక్ ను లాంచ్ చేశారు. రూ.1.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఇది వినియోగదారులకు అందుబాటు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.

LML Scooter: సూపర్ లుక్ తో ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే మతిపోతుందంతే..!
Lml Electric Scooter
Follow us
Srinu

|

Updated on: Feb 02, 2023 | 1:56 PM

భారత మార్కెట్ లోకి మరో కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ రానుంది. ఎల్ఎంఎల్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. సూపర్ లుక్ తో అధునాత ఫీచర్లతో ఉండే ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందరని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఆటో ఎక్స్ పో 2023 లో ఈ బైక్ ను లాంచ్ చేశారు. రూ.1.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఇది వినియోగదారులకు అందుబాటు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 150 కిలో మీటర్లు నడిచేలా ఈ బైక్ ను డిజైన్ చేశారు. అలాగే గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంతో వెళ్తుందని పేర్కొంటున్నారు. అయితే ఈ బైక్ లో ఉండే మిగిలిన ఫీచర్లను ఓ సారి తెలుసుకుందాం. 

ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్లు ఇవే..

ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో రెండు లిథియం ఐయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ స్కూటర్ 5 కేడబ్ల్యూ మోటర్ తో వస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపు మోనో షాక్ అబ్జార్బర్ తో వస్తుంది. ముందు డిస్క్ బ్రేక్ తో వెనుక వైపు డ్రమ్ బ్రేక్ తో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 12 అంగుళాల టైర్స్ తో అలాయ్ వీల్స్ తో ఈ స్కూటర్ వస్తుంది. అలాగే ఈ స్కూటర్ 115 కిలోల బరువు ఉంటుంది. బ్లూ టూత్ కనెక్టవిటీతో 7.0 అంగుళాల టీఎఫ్ టీ క్లస్టర్ తో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే సూపర్ ఎల్ ఈడీ డిస్ ప్లే,  ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, రివర్స్ మోడ్ , హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అధునాత ఫీచర్లు ఉంటాయి. అలాగే ఈ బైక్ కు ముందు వైపు, వెనుక వైపు కెమెరాలు కూడా ఉంటాయి. అలాగే ఈ స్కూటర్ కు రెండు సంవత్సరాల వారెంటీ కూడా వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి

ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 సెప్టెంబర్ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఏడాది 2.25 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని పెట్టకున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. హర్యానాలోని హర్లే డేవిడ్ సన్ బైక్ ఉత్పత్తి కేంద్రంలో ఈ స్కూటర్లను తయారు చేయనున్నారు. ఇలా అధునాతన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు సహ కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చేలా నిలబడతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!