Asus ZenBook Duo: ఆసస్ నుంచి అదిరే ల్యాప్‌టాప్ లాంచ్.. టచ్‌స్క్రీన్‌తో మతిపోయే స్పెసిఫికేషన్లు

తాజాగా ఆసస్ కంపెనీ జెన్ బుక్ డుయో (2024) పేరుతో ల్యాప్‌టాప్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ 14 అంగుళాల టచ్‌స్క్రీన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు, వేరు చేసేలా బ్లూటూత్ కీబోర్డ్, అంతర్నిర్మిత కిక్‌స్టాండ్‌తో వస్తుంది. కొత్త జెన్‌బుక్ డుయో సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ ఏఓ సర్టిఫికేట్ పొందాయి. ముఖ్యంగా మెరుగుపరచబడిన ఏఐ ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు.

Asus ZenBook Duo: ఆసస్ నుంచి అదిరే ల్యాప్‌టాప్ లాంచ్.. టచ్‌స్క్రీన్‌తో మతిపోయే స్పెసిఫికేషన్లు
Asus Zenbook Duo
Follow us

|

Updated on: Apr 18, 2024 | 4:15 PM

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఇటీవల అన్ని కంపెనీలు సరికొత్త ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఆసస్ కంపెనీ జెన్ బుక్ డుయో (2024) పేరుతో ల్యాప్‌టాప్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ 14 అంగుళాల టచ్‌స్క్రీన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు, వేరు చేసేలా బ్లూటూత్ కీబోర్డ్, అంతర్నిర్మిత కిక్‌స్టాండ్‌తో వస్తుంది. కొత్త జెన్‌బుక్ డుయో సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ ఏఓ సర్టిఫికేట్ పొందాయి. ముఖ్యంగా మెరుగుపరచబడిన ఏఐ ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు. ఈ నేపథ్యంలో ఆసస్ జెన్ బుక్ డుయో ల్యాప్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆసస్ జెన్ బుక్ డుయో ధర

ఆసస్ జెన్ బుక్ డుయో (2024) భారతదేశంలో నాలుగు వేరియంట్‌లలో వస్తుంది. ఇది బేస్ వేరియంట్‌కు రూ. 1,59,990 నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కి రూ. 2,39,990 వరకు లభిస్తుంది. వినియోగదారులు ఈ ల్యాప్‌టాప్‌లను ఆసస్ ఈ-షాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆసస్  ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, ఆర్ఓజీ స్టోర్‌లు, అన్ని అధీకృత ఆసస్ డీలర్ల వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

ఆసస్ జెన్ బుక్ డుయో స్పెసిఫికేషన్లు

  • ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలతో వస్తుంది. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది.
  • ఆసస్ జెన్ బుక్ ల్యాప్‌టాప్ గరిష్టంగా 5.1 జీహెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్‌తో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 185 హెచ్ ప్రాసెసర్‌తో వస్తుంది.
  • ఈ ల్యాప్‌టాప్ 32 జీబీ + 1 టీబీ  వేరియంట్ ఎస్ఎస్‌డీతో వస్తుంది. 65 వాట్స్ యూఎస్‌బీ టైప్- సీ ఛార్జర్‌తో వస్తుంది. 
  • ఈ ల్యాప్‌టాప్ సిరీస్ విండోస్ 11తో వస్తుంది.  అలాగే  వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం వైఫై 6ఈ, బ్లూటూత్ వెర్షన్ 5.4తో వస్తుంది.
  • అలాగే ఈ సిరీస్‌లోని ఐ/ఓ పోర్ట్ ఎంపికలో హెచ్‌డీఎంఐ 2.1 పోర్ట్, 3.5 ఎంఎం కాంబో జాక్‌తో వస్తుంది. 
  • ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్ వేరు చేసేలా బ్లూటూత్ కీబోర్డ్, అంతర్నిర్మిత కిక్‌స్టాండ్, ఫుల్ హెచ్‌డీ ఐఆర్ వెబ్‌క్యామ్‌తో కూడా వస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏలకులను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ మటాషే..
ఏలకులను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ మటాషే..
వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!