ChatGPT: మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే చాట్‌జీపీటీ.. పరిశోధనల్లో..

ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న టెక్నాలజీల్లో కూడా ఏఐ అందుబాటులోకి వస్తోంది. యూట్యూబ్‌ మొదలు మరెన్నో సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను జోడిస్తున్నాయి. ఇదిలా ఉంటే మానవులకు ఆన్‌లైన్‌ సేవలను మరింత చేరువ చేస్తున్న చాట్‌జీపీటీపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చాట్‌జీపీటీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ఆసక్తిని పెంచింది...

ChatGPT: మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే చాట్‌జీపీటీ.. పరిశోధనల్లో..
Chatgpt
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 13, 2023 | 4:51 PM

చాట్‌జీపీపీ ఇప్పుడీ పదం యావత్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ వచ్చిన ఈ టెక్నాలజీకి ప్రపంచం ఫిదా అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు, అదే విధంగా స్టార్టప్‌ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న టెక్నాలజీల్లో కూడా ఏఐ అందుబాటులోకి వస్తోంది. యూట్యూబ్‌ మొదలు మరెన్నో సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను జోడిస్తున్నాయి. ఇదిలా ఉంటే మానవులకు ఆన్‌లైన్‌ సేవలను మరింత చేరువ చేస్తున్న చాట్‌జీపీటీపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చాట్‌జీపీటీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ఆసక్తిని పెంచింది. చాట్‌జీపీటీ మనుషుల భావోద్వేగాలను సైతం అర్థం చేసుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. మైక్రోసాఫ్ట్‌, విలియం అండ్ మేరీ, ఆసియాలోని పరిశోధ‌నా కేంద్రాలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. ఈ అధ్యయనంలో భాగంగా.. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడ‌ల్స్ (ఎల్ఎల్ఎం) మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకోగలవని వెల్లడైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌కు మూలమైన లార్జ్ ల్యాంగ్వేజ్ మోడ‌ల్స్ మానవ ఉద్వేగాలను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా స్పందిస్తాయని పరిశోధకులు తెలిపారు.

మనుషుల భావోద్వేగాలను చాట్‌జీపీటీ అర్థం చేసుకొని.. అందుకు అనుగుణంగా స్పందిస్తాయ‌ని ఈ అధ్య‌య‌నంలో వెల్లడైంది. కొన్ని భావోద్వేగాలకు చాట్‌జీపీటీ స్పందన నాణ్యత మెరుగ్గా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా.. ‘ఇది త‌న‌కు చాలా కీల‌కం, నా కెరీర్‌లో ఇది కీల‌క ఘ‌ట్టం’ వంటి క్యూస్‌లతో కూడిన ప్రాంప్ట్‌లకు చాట్‌జీపీటీ స్పందించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా ఉన్న ఈ టెక్నాలజీ ఈ ఆవిష్కరణతో.. ఆర్టిఫిషియ‌ల్ జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏజీఐ)గా మారనుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే మైక్రో సాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరూ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ట్యూటర్‌, ఏఐ డాక్ట‌ర్‌, ప్రోగ్రామ‌ర్‌, క‌న్స‌ల్టెంట్‌ను కలిగి ఉండాలన్నదే తన కల అని తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏఐ టెక్నాలజీ కోసం దిగ్గజ ఐటీ సంస్థలు ఏ రేంజ్‌లో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఏఐలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..