AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laptop Cleaning Tips: ల్యాప్‌టాప్ పాడవకుండా కీబోర్డ్‌ను ఎలా శుభ్రం చేయాలి? సులభమైన చిట్కాలు

ల్యాప్‌టాప్‌ కీబోర్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కీబోర్డులో సమస్య తలెత్తే అవకాశం ఉంది. దుమ్ము, ధూళి చేరడం వల్ల కీబోర్డు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది..

Laptop Cleaning Tips: ల్యాప్‌టాప్ పాడవకుండా కీబోర్డ్‌ను ఎలా శుభ్రం చేయాలి? సులభమైన చిట్కాలు
Laptop Cleaning Tips
Subhash Goud
|

Updated on: Dec 05, 2022 | 4:24 PM

Share

మీరు ఇంట్లో లేదా ఆఫీసులో పని చేస్తున్నా, మీ ల్యాప్‌టాప్ కీబోర్డ్ చాలా మురికిగా ఉండే అవకాశం ఉంది. దుమ్ము, వేలి చెమట, బిస్కెట్ల పొడి లేదా మీ తలపై వెంట్రుకలు ఉంటాయి. అయితే చాలా మంది ల్యాప్‌టాప్‌ కీబోర్డులను శుభ్రం చేయరు. ల్యాప్‌టాప్‌ కీబోర్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కీబోర్డులో సమస్య తలెత్తే అవకాశం ఉంది. దుమ్ము, ధూళి చేరడం వల్ల కీబోర్డు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. చిన్న కీలు లేదా గాడ్జెట్‌లు పాడవకుండా ల్యాప్‌టాప్ కీబోర్డ్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం. కీబోర్డ్‌పై ఏదైనా అదనపు ప్రెజర్ ఉంటే, అది పాడయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు ఏ మెటీరియల్‌లను సురక్షితంగా ఉపయోగించాలో తెలుసుకోవాలి.

☛ మైక్రోఫైబర్ క్లాత్

☛ సాఫ్ట్ పెయింట్ బ్రష్ -కాటన్

ఇవి కూడా చదవండి

☛ స్వాబ్

☛ కంప్రెస్డ్ ఎయిర్

☛ కీబోర్డ్ క్లీనర్

ల్యాప్‌టాప్‌ను ఎలా శుభ్రం చేయాలి?

  1. ముందుగా మీ ల్యాప్‌టాప్ నుండి అడాప్టర్‌ని తీసి, దాన్ని షట్ డౌన్ చేయండి. ఇలా చేసి తుడవడం వల్ల ఎటువంటి విద్యుత్ సమస్య ఉండదు.
  2. మీరు మూసి ఉన్న ల్యాప్‌టాప్‌ను బాగా పట్టుకుని, తలకిందులుగా చేసి శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ఆహార ముక్కలు, వెంట్రుకలు, ఇతరాలు నేలపై పడి కీబోర్డ్‌ను శుభ్రం చేయడం సులభం అవుతుంది.
  3. ఇప్పుడు ల్యాప్‌టాప్‌ను మైక్రోఫైబర్ క్లాత్, సాఫ్ట్ పెయింట్ బ్రష్ లేదా ఏదైనా కంప్రెస్డ్ ఎయిర్ గాడ్జెట్ సహాయంతో శుభ్రం చేయండి. ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ బలం ఉపయోగించకండి. తేలియపాటిగా చేతులతో శుభ్రం చేయండి.
  4. లిక్విడ్ కీబోర్డ్ క్లీనర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే కీబోర్డ్‌లో దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. క్లీనర్‌ను నేరుగా కీబోర్డ్‌పై ఎప్పుడూ స్ప్రే చేయవద్దు. దీని కోసం ఒక మృదువైన గుడ్డను తీసుకుని దానిపై క్లీనర్ను కొద్దిగా అప్లై చేసి, ఆపై మెత్తటి గుడ్డ సహాయంతో శుభ్రం చేయండి. లిక్విడ్‌ను నేరుగా అప్లై చేస్తే ల్యాప్‌టాప్ సర్క్యూట్ దెబ్బతింటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి