WhatsApp Update: వాట్సప్ మెసెజ్‌లో చిన్న అక్షరాలను సరిగ్గా చూడలేకపోతున్నారా..? కొత్త అప్‌డేట్ వచ్చేసింది.. అదేంటంటే..
ఐఓఎస్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను తీసుకువస్తోంది. దీంతో మీరు సందేశాలను మంచిగా చూడవచ్చు. అంటే రీడబిలిటీ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందంటున్నారు వాట్సప్ టెక్నికల్ టీమ్..

ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ అగ్ర స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుతూ.. ఫీచర్లను అప్‌డేట్ చేస్తోంది. వాట్సప్‌లో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి Meta నిరంతరం పని చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు వాట్సాప్ వినియోగదారులకు మెటా ఎన్నో గొప్ప ఫీచర్లను అందించింది. ఇదిలా ఉంటే వాట్సాప్‌కు సంబంధించిన అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. వాస్తవానికి, వాట్సప్ కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని కింద iOS వినియోగదారులు కమ్యూనిటీ సమూహాలలో మెరుగైన రీడబిలిటీని పొందుతారు. వినియోగదారులు సందేశాన్ని పెద్ద పరిమాణంలో చూస్తారని అర్థం.
వాట్సాప్ అభివృద్ధిని పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo ప్రకారం, WhatsApp కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని కింద iOS వినియోగదారులు కమ్యూనిటీ సమూహాలలో మెరుగైన రీడబిలిటీని పొందుతారు. వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. సందేశం మొత్తం స్క్రీన్‌పై కనిపించడం. దాని ఫాంట్ పరిమాణం కూడా పెద్దది కావడం గమనించవచ్చు. దీనితో పాటు, సందేశం ఎగువన ప్రొఫైల్ చిత్రం కూడా కనిపిస్తుంది. ఈ ఫీచర్ కారణంగా, మీరు ఇతర చాట్‌లు, కమ్యూనిటీ గ్రూప్ చాట్‌ల మధ్య తేడాను గుర్తించ్చు. ప్రస్తుతం, ఈ ఫీచర్ కొన్ని బీటా టెస్టర్ల కోసం విడుదల చేయబడింది. కంపెనీ రాబోయే సమయంలో విడుదల చేయనుంది.

చాట్‌లను లాక్ చేయగలరు
వాట్సప్ మరొక ఫీచర్‌పై పని చేస్తోంది. దీని కింద వినియోగదారులు వ్యక్తిగత చాట్‌లను కూడా లాక్ చేయగలరు. అంటే, మీరు ఒక వ్యక్తితో చేసిన చర్చను మీరు మాత్రమే చూసేలా పరిమితం చేయాలనుకుంటే.. దీని కోసం మీరు ఈ చాట్‌లో పాస్‌కోడ్ లేదా వేలిముద్ర లాక్‌ని ఉంచవచ్చు. ఒక వ్యక్తి ఈ చాట్‌ని తెరవడానికి ప్రయత్నిస్తే.. అతనికి ముందుగా పాస్‌వర్డ్ లేదా వేలిముద్ర అవసరం. ఒక విధంగా, ఈ ఫీచర్ మీ ప్రైవసీని మరింత పెంచినట్లే అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ కూడా అభివృద్ధి దశలో ఉంది. ఇది సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..