AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSLV-C51: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌… విజయవంతమైన ప్రయోగం.. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

PSLV-C51: భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది...

PSLV-C51: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌... విజయవంతమైన ప్రయోగం.. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి..
Narender Vaitla
|

Updated on: Feb 28, 2021 | 10:51 AM

Share

PSLV-C51: భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెజానియా-1తో పాటు 18 ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళుతోంది. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా విదేశీ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను భారత్‌ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం  నాలుగు దశలు విజయవంతమయ్యాయి. అమెజానియా అమెజానియా-1తో పాటు 18 ప్రైవేటు ఉపగ్రహాలు అంతరిక్ష్య కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించాయి. ప్రయోగం విజయవంతమవడం పట్ల ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేసిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే.. పీఎస్‌ఎల్వీ సీ-51 ద్వారా..భగవద్గీతతో పాటు..ప్రధాని మోదీ ఫొటోను నింగోలోకి పంపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ఈ పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్‌ ద్వారా.. ఓ ఈ అరుదైన ఘట్టానికి తెరలేపింది చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్స్‌ అనే ఇండియా సంస్థ. మొట్టమొదటిసారిగా తాము చేస్తున్న ఈ ప్రయోగంలో .. ప్రధాని మోదీ ఫొటో కింద..ఆత్మనిర్భర్‌ మిషన్‌ అనే పదాలతో పాటు భగవద్గీతను పంపించారు. అంతేకాదు. మరో 25వేల మంది పేర్లను కూడా పంపించారు. ఆ 25వేల మందిలో వెయ్యి మంది విదేశీయులు కాగా..చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లున్నాయి.

Also Read: IT Act 2021: 50 లక్షల యూజర్లు దాటితే ప్రధాన మీడియానే.. సంస్థలన్నీ సమాచారమివ్వాల్సిందే..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..