iPhone 16 Series: అంతకు మించి ఉండనున్న ఐఫోన్ 16.. ఫీచర్లపై మొదలైన లీక్స్.
ఐఫోన్‌లోని సెక్యూరిటీ, హైఎండ్ ఫీచర్సే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదలైన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 79,990గా ఉంది. టెక్ మార్కెట్లో ఐఫోన్ 15 ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇదిలా ఉంటే యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15కి కొనసాగింపుగా త్వరలోనే...
గ్లోబల్ టెక్ మార్కెట్లో యాపిల్ బ్రాండ్స్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఐఫోన్ అంటే టెక్ లవర్స్ ఎగబడుతుంటారు. ఐఫోన్ కొత్త సిరీస్ వస్తుందంటే చాలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఫోన్ ఇలా రిలీజ్ అయ్యిందంటే చాలు, స్టోర్స్ ముందు క్యూ కట్టే సందర్భాలు కూడా చూశే ఉంటాం.
ఐఫోన్‌లోని సెక్యూరిటీ, హైఎండ్ ఫీచర్సే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదలైన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 79,990గా ఉంది. టెక్ మార్కెట్లో ఐఫోన్ 15 ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇదిలా ఉంటే యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15కి కొనసాగింపుగా త్వరలోనే ఐఫోన్ 16ని లాంచ్ చేయనున్నారు. అయితే ఐఫోన్ 15లో పెద్దగా కొత్తదనం లేదన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఐఫోన్ 16లో ఆ లోటును భర్తీ చేయాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఐఫోన్ 15లో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని అంతా ఆశించారు. కానీ యాపిల్ మాత్రం 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోనే సరిపెట్టింది. దీంతో యాపిల్ యూజర్లు ఈ విషయంలో కాస్త నిరాశకు గురయ్యారని చెప్పాలి. ఐఫోన్ 16 సిరీస్‌లో ఉండనున్న ఫీచర్లు ఇవేనని నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఐఫోన్ 16 బేస్ మోడల్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 16 ప్రోలో 6.3 ఇంచెస్ డిస్‌ప్లేను అందించనున్నారని, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 ఇంచెస్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఐఫోన్ 16, 16 ప్లస్‌లో వరుసగా 6.1, 6,7 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఐఫోన్ 16లో సాలిడ్ స్టేట్ బట్‌ను ఇచ్చే ఛాన్సెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో ఐఫోన్ 16ను తీసుకొచ్చేందుకు యాపిల్ భావిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్‌లో ఏ17 చిప్‌సెట్‌ను, ప్రో మోడల్‌లో ఏ18 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక కెమెరాకు కూడా 16 సిరీస్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐఫోన్ 16లో టెట్రా ప్రిజం టెలిఫొటో కెమెరాను ఇవ్వనున్నారని సమాచారం. ఇది ఆప్టికల్ జూమ్‌ను 3x నుంచి 5x పెంచుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..