Knowledge: ఇస్రో ఇప్పటివరకు ఎన్ని శాటిలైట్లను ప్రయోగించిందో తెలుసా? ఈ ఏడాది మొదటి ప్రయోగానికి రంగం సిద్దం..
ఇస్రో ఇప్పటివరకు చెప్పని నిజాలు కేంద్ర మంత్రి నోట.. ముఖ్యమైన సమాచారం మీకోసం..
ISRO satellites 2022: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 1975 నుండి దేశానికి చెందిన మొత్తం 129 ఉపగ్రహాలు, 36 దేశాలకు చెందిన 342 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. విదేశీ ఉపగ్రహాల్లో 39 వాణిజ్య ఉపగ్రహాలు కాగా మిగిలినవి నానో ఉపగ్రహాలు. ఇక స్వదేశానికి చెందిన 53 ఆపరేషనల్ శాటిలైట్లు స్పేస్‌లో ఉన్నాయి. వీటిలో 21 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, 8 నావిగేషన్ ఉపగ్రహాలు, 21 భూమి పరిశీలన ఉపగ్రహాలు, మూడు సైన్స్ ఉపగ్రహాలు. వీటి ద్వారా దేశానికి వివిధ సేవలు అందుతున్నాయని గురువారం (ఫిబ్రవరి 9) రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్ వ్రాతపూర్వక సమాధానంలో తెలిపారు.
శాటిలైట్ ఎనేబుల్ డేటా అండ్ సర్వీసులు దేశంలోని వివిధ రంగాల ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. వీటిలో టెలివిజన్ ప్రసారం, డైరెక్ట్-టు-హోమ్, ఏటీఎమ్, మొబైల్ కమ్యూనికేషన్, టెలీ-ఎడ్యుకేషన్, టెలి-మెడిసిన్ అండ్ వెదర్ అడ్వైజరీస్, పెస్ట్ ఇన్ఫెస్టేషన్, ఆగ్రో మెటీరియాలజీ, పొటెన్షియల్ ఫిషింగ్ జోన్‌ల కోసం వినియోగిస్తున్నారని మంత్రి తెలిపారు. అదేవిధంగా దేశ వ్యవసాయానికి చెందిన వివిధ విభాగాల కోసం కూడా శాటిలైట్ డేటా వినియోగించబతుడుందన్నారు. దేశ అవసరాల నిమిత్తం ఇస్రో మరిన్ని ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉందని సింగ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ ఏడాది తొలిదశ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కొత్త ఏడాదిలో తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అంతా అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి14న ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-52 వాహక నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఫిబ్రవరి13 వేకువజామున 4.29 గంటలకు ప్రారంభమవుతుంది. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం వాహక నౌక నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ ప్రయోగంలో ఐఆర్‌శాట్-1-ఏతో పాటు ఐఎన్‌ఎస్-2-టి.డి, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-52 తనతోపాటు స్పేస్‌లోకి తీసుకెళ్లనుంది.
Also Read: