Instagram: యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ న్యూ ఇయర్ గిఫ్ట్… ‘ప్లేబ్యాక్’ ఫీచర్‌తో అదిరిపోయే సర్‌ప్రైజ్..
Instagram: ఫేస్‌బుక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతటి ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్ దక్కింది...

Instagram: ఫేస్‌బుక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతటి ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్ దక్కింది. ముఖ్యంగా యూత్‌ను టార్గె్‌ను చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఫీచర్లు పెద్ద ఎత్తున ఆట్రాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 2021 ఏడాది ముగియడానికి ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ ఏడాది మనం గడిపిన మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది.? భలే ఉంటుంది కదూ.. దీనిని నిజం చేయడానికే ఇన్‌స్టాగ్రామ్’ప్లేబ్యాక్’ పేరుతో ఓ ఫీచర్‌ను తీసుకువచ్చింది.
సాధారణంగా ముఖ్యమైన ఈవెంట్స్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాం. అలా చేసిన వాటిలో ముఖ్యమైన 10 సందర్భాలను సెలక్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇలా సెలక్ట్ చేసుకున్న వాటిని తమ స్టోరీ మీద జత చేసుకునే ఫీచర్‌ను అందించారు. ఈ వీడియోను ఇతరులతో షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అయితే ఇది కేవలం లిమిటెడ్ ఫీచర్ మాత్రమే. ఈ ఏడాది ముగింపు వరకు మాత్రమే ఫీచర్ అందుబాటులో ఉండనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఏడాది మీ మధుర జ్ఞాపకాలను మరోసారి షేర్ చేసుకోండి.
Also Read: Webb Space Telescope: మూడు దశాబ్దాల కలకు టైం ఫిక్స్.. నేడే నింగిలోకి వెబ్ టెలిస్కోప్..
Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..