Whatsapp: వాట్సాప్‌ అంతరాయంపై రంగంలోకి భారత ఐటీ శాఖ.. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలంటూ..

వాట్సాప్‌ సేవలకు అంతరాయంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ విషయమై ఐటీ శాఖ మెటా ఇండియాను నివేదిక కోరింది. వాట్సాప్‌ సేవల అంతరాయం వెనకాల అసలు కారణం ఏంటన్న దానిపై...

Whatsapp: వాట్సాప్‌ అంతరాయంపై రంగంలోకి భారత ఐటీ శాఖ.. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలంటూ..
Whatsapp Meta India
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 25, 2022 | 3:51 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా స్థంభించినట్లైంది. కేవలం రెండు గంటలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో యూజర్లు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. మెసేస్‌లు, స్టేటస్‌లు అప్‌డేట్‌ కాకపోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే గతంలోనూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయం ఏర్పడ్డా.. ఇలా ఏకంగా రెండు గంటల సుదీర్ఘ సమయంలో సేవలు నిలిచిపోవడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా ఎట్టకేలకు వాట్సాప్‌ సేవలను తిరిగి పునరుద్ధరించింది.

ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌ సేవలకు అంతరాయంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ విషయమై ఐటీ శాఖ మెటా ఇండియాను నివేదిక కోరింది. వాట్సాప్‌ సేవల అంతరాయం వెనకాల అసలు కారణం ఏంటన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. భారత్‌లో వాట్సాప్‌కు 48 కోట్ల యూజర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇండియాలో రోజుకి 10 వేల కోట్ల మెసేజ్‌లు పంపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇలా రెండు గంటలపాటు సేవలకు అంతరాయం కలగడంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

దీంతో ఐటీశాఖ మెటా ఇండియాను వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వాట్సాప్‌ సేవలు ఫోన్‌లో పునరుద్ధరించిన తర్వాత కూడా వెబ్‌ వెర్షన్‌లో కాసేపు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయమై యూజర్లు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ట్వీట్‌లు చేశారు. అయితే కాసేపటి తర్వాత వాట్సాప్‌ వెబ్‌ వెర్షన్‌ సమస్య కూడా పరిష్కారమైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?