Jio recharge plans: ఆకట్టుకుంటున్న జియో నయా ప్లాన్స్.. ఇక యూజర్లకు పండగే..!

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్లకు అనేక సేవలు అందిస్తూ ముందుకు దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ నెట్ వర్క్ నే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ డేటా, కాల్స్ విషయంలో జియో అనేక మార్పులు తీసుకువచ్చి వినియోగదారుల ఆదరణ పొందింది. అలాగే తన రీచార్జి ప్లాన్లను అప్ డేట్ చేస్తూ మరిన్ని మెరుగైన సేవలు అందిస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా రూ.182 రీచార్జి ప్లాన్ తీసుకువచ్చింది. దీని ద్వారా రోజూ 2 జీబీ చొప్పున 28 రోజులకు 56 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే కేవలం జియో ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంది.

Jio recharge plans: ఆకట్టుకుంటున్న జియో నయా ప్లాన్స్.. ఇక యూజర్లకు పండగే..!
Follow us
Srinu

|

Updated on: Sep 08, 2024 | 7:50 PM

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్లకు అనేక సేవలు అందిస్తూ ముందుకు దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ నెట్ వర్క్ నే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ డేటా, కాల్స్ విషయంలో జియో అనేక మార్పులు తీసుకువచ్చి వినియోగదారుల ఆదరణ పొందింది. అలాగే తన రీచార్జి ప్లాన్లను అప్ డేట్ చేస్తూ మరిన్ని మెరుగైన సేవలు అందిస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా రూ.182 రీచార్జి ప్లాన్ తీసుకువచ్చింది. దీని ద్వారా రోజూ 2 జీబీ చొప్పున 28 రోజులకు 56 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే కేవలం జియో ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అవకాశం లేదు. జియోకు దేశ వ్యాప్తంగా దాదాపు 49 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ కంపెనీ రూ. 200 కంటే తక్కువ ధరతో అనేక ప్లాన్లను ప్రవేశపెట్టడం ద్వారా వారిని అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇటీవల అన్ని టెలికాం కంపెనీలు తమ రీచార్జి ప్లాన్ల ధరలను పెంచాయి. జియో కూడా ఈ బాటలోనే నడిచింది. అయితే యూజర్లకు ఆర్థిక భారం తగ్గించడానికి చర్యలు చేపట్టింది. రీచార్జుల ధరలను పెంచినప్పటికీ, మరికొన్నింటిని వారికి అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిలో భాగంగారూ. 200 కంటే తక్కువ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో హై స్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్ సేవలు ఉన్నాయి.

కేవలం డేటా కోెసమే..

జియో రూ. 182 రీఛార్జ్ ప్లాన్ జియో ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ద్వారా రోజుకు 2 జీబీ చొప్పున 28 రోజులకు 56 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీనిలో కాలింగ్, మెసేజింగ్ ప్రయోజనాలు ఉండవు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ ప్లాన్ ప్రయోజనాలకు అర్హులు కారు.

మరిన్ని ప్లాన్లు ఇవే

జియో నుంచి రూ. 200 కంటే తక్కువ ధరకు ఇతర రీఛార్జి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 122 ప్లాన్ వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటుతో పాటు రోజుకు 1 జీబీ డేటాను అందిస్తుంది. అలాగే రూ. 86 రీఛార్జ్ ప్లాన్ పై 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 512 ఎంబీ డేటా అందుతుంది. అలాగే జియో వినియోగదారులకు రూ. 26 ప్లాన్‌ 28 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. దీని ద్వారా 2 జీబీ డేటాను అందుతుంది. రూ.62 ప్లాన్ లో రోజువారీ పరిమితి లేకుండా 6 జీబీ డేటాను అందుతుంది. ఈ రెండు ప్లాన్లు జియోఫోన్ వినియోగదారులకు కోసమే ప్రవేశపెట్టారు. వీటిలో రోజువారీ డేటా పరిమితి ఉండదు.

ఇవి కూడా చదవండి

వార్షికోత్సవ ఆఫర్

జియో టెలికాం కంపెనీ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని ఆఫర్లను ప్రవేశపెట్టింది. తన మొబైల్ వినియోగదారుల కోసం ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్లపై వీటిని అందిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ మధ్య రీఛార్జి చేసుకునే జియో సబ్‌స్క్రైబర్లు రూ. 700 విలువైన మూడు ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 899, రూ. 999 త్రైమాసిక ప్లాన్లతో పాటు రూ. 3599 వార్షిక ప్లాన్‌ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ