సునీతా విలియమ్స్ ఏమి చదువుకున్నారంటే.? 

TV9 Telugu

18 December 2024

అంతరిక్షంలో పరిశోధన కోసం అత్యధిక సమయం గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు శాస్త్రవేత్త సునీతా విలియమ్స్.

సునీతా విలియమ్స్ 1983లో యూఎస్ లోని 609 వెబ్‌స్టర్ స్ట్రీట్ లో నీధమ్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు.

1987లో యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి ఫిజికల్ సైన్సెస్‌లో BSc పట్టా అందుకున్నారు సునీతా విల్లియమ్స్.

1995లో సునీత ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు.

సునీత అమెరికా నేవీలో కూడా పనిచేశారు. 1989లో నావల్ ఏవియేటర్‌గా మారారు. తర్వాత విజయాలను అధిరోహించడం కొనసాగించారు.

సునీత విల్లియమ్స్ తండ్రి 1958 లో అహ్మదాబాద్ నుంచి అమెరికా వెళ్లారు. సునీత ఆమె కుటుంబంలో చిన్న కూతురు.

సునీత విల్లియమ్స్ లాగా మీరు కూడా అంతరిక్షానికి వెళ్లాలనుకుంటే ఏరోనాటిక్స్ లేదా ఏరోస్పేస్‌లో డిగ్రీ పొందాలి.

ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత మీరు ఇస్రో, నాసా లేదా ఇంకేదైనా అంతరిక్ష పరిశోధన సంస్థలో పని చేయవచ్చు.