Iphone 13: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ ఆఫర్.. ఏకంగా రూ. 36,099 తగ్గింపు
యాపిల్ ఐఫోన్ 13 రిలీజ్ చేసి రేండేళ్లు పూర్తి అవుతుంది. ఈ ఫోన్ ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో ఒకటి. యాపిల్ ఐ ఫోన్ 14లో కొత్త ఫీచర్లు లేనందున చాలా మంది ఇప్పటికీ యాపిల్ ఐ ఫోన్ 13ను నిజమైన ఫ్లాగ్‌షిప్‌గా పరిగణిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్స్‌లో యాపిల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా యాపిల్ స్మార్ట్ ఫోన్లవైపు ఆకర్షితులవుతూ ఉంటారు. యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు యాపిల్ కంపెనీలో కొత్త బ్రాండ్స్‌ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. యాపిల్ ఐఫోన్ 13 రిలీజ్ చేసి రేండేళ్లు పూర్తి అవుతుంది. ఈ ఫోన్ ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో ఒకటి. యాపిల్ ఐ ఫోన్ 14లో కొత్త ఫీచర్లు లేనందున చాలా మంది ఇప్పటికీ యాపిల్ ఐ ఫోన్ 13ను నిజమైన ఫ్లాగ్‌షిప్‌గా పరిగణిస్తున్నారు. తక్కువ ధరలో మంచి ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవాలంటే యాపిల్ ఐఫోన్ 13 మంచి ఎంపికని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ ఐ ఫోన్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,900కే అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్‌పై రూ. 36,099 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు ఎలా లభిస్తుందో? ఓ సారి చెక్ చేద్దాం.
యాపిల్ ఐ ఫోన్ 13 2021లో యాపిల్ ఐ ఫోన్ 13 ప్రో, మినీతో పాటు రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. యాపిల్ ఐఫోన్ 13 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లు ఇప్పుడు వరుసగా రూ.79,900, రూ.99,900గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ. 7,901 తగ్గింపు తర్వాత రూ. 61,999గా ఉంది. అలాగే కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో ఐఫోన్ 13 ధర రూ.58,900కి తగ్గింది. ఇది కాకుండా, కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 33,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో కొనుగోలుదారులు యాపిల్ ఐ ఫోన్ 13ని ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ. 25,900కి పొందవచ్చు.
అలాగే ఫీచర్ల విషయానికి వస్తే యాపిల్ ఐ ఫోన్ 13 లాగానే ఐ ఫోన్ 14 ఫీచర్లు కూడా ఉన్నాయి. 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, ఏ15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ 4 కే డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్‌తో 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది నైట్ మోడ్‌తో 12 ఎంపీ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరాను కూడా వస్తుంది. ఈ ఫోన్ 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..