HP Laptops: మరో నాలుగు కొత్త ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్ చేసిన హెచ్‌పీ.. ఫీచర్స్ చూస్తే మతిపోతుందంతే
హెచ్‌పీ కూడా తాజాగా నాలుగు కొత్త ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు హెచ్‌పీ 14, హెచ్‌పీ 15, హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14, హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్ 360 పేరుతో నాలుగు ల్యాప్‌టాప్స్‌ను అందుబాటులోకి తీసుకవస్తునట్లు ప్రకటించారు.
భారతదేశంలో ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం తర్వాత వర్క్ ఫ్రం హోం కల్చర్ విపరీతంగా పెరిగింది. దీంతో ల్యాప్‌టాప్‌ల వాడకం కూడా మెరుగుపడింది. అలాగే విద్యార్థులు కూడా ఆన్‌లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌లపై ఆధారపడుతున్నారు. గణనీయంగా పెరిగిన ల్యాప్‌టాప్‌ల వినియోగం వల్ల కంపెనీలు కూడా తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాయి. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ప్రముఖ్య ల్యాప్‌టాప్ తయారీ సంస్థ అయిన హెచ్‌పీ కూడా తాజాగా నాలుగు కొత్త ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు హెచ్‌పీ 14, హెచ్‌పీ 15, హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14, హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్ 360 పేరుతో నాలుగు ల్యాప్‌టాప్స్‌ను అందుబాటులోకి తీసుకవస్తునట్లు ప్రకటించారు. హెచ్‌పీ పెవిలియన్ సిరీస్ తాజా 13వ జెన్ ఇంటెల్ ప్రాసెసర్‌తో అమర్చి ఉంటుంది. అయితే పెవిలియన్ ఎక్స్ 360 ల్యాప్‌టాప్ 360 డిగ్రీల సర్దుబాటు చేయగల కీలు, టచ్ స్క్రీన్, మల్టీ టాస్కింగ్ కోసం బహుళ పోర్ట్‌లను కలిగి ఉంటుంది. గత నెలలో కంపెనీ హెచ్‌పీ పెవిలియన్ ఏరో 13 లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ల్యాప్‌టాప్ ధర, ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
హెచ్‌పీ 14, హెచ్ 15 ప్రధాన ఫీచర్లు ఇవే
- హెచ్‌పీ 14 ల్యాప్‌టాప్‌లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే 1920 x 1080 రిజుల్యూషన్‌తో వస్తుంది.
- హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల పూర్తి హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో యాంటీ గ్లేర్ కోటింగ్‌తో వస్తుంది.
- హెచ్‌పీ 14 ల్యాప్‌టాప్‌లో 13వ తరం ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో వస్తుంది.
- అలాగే హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్ 13వ తరం ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో వస్తుంది.
- ఈ రెండు ల్యాప్‌టాప్స్‌లో విండోస్ 11 సపోర్ట్ చేస్తుంది.
- అలాగే ఇంటెల్ ఐరిస్ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్
- 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ
- హెచ్‌డీ వెబ్‌క్యామ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్
- వైఫై 6 మద్దతతో పాటు మాన్యువల్ షట్టర్, నాయిస్ క్యాన్సిలేషన్‌తో కూడిన పూర్తి హెచ్‌డీ వెబ్‌క్యామ్
- అలాగే ఐచ్ఛిక వేలిముద్ర రీడర్
హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14 ఫీచర్లు
- 2.8 కే రిజల్యూషన్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 14 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- 13వ తరం ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్
- 16 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ
- పీడీ ఛార్జింగ్‌తో కూడిన 51 డబ్ల్యూహెచ్ బ్యాటరీ
- అంతర్నిర్మిత అమెజాన్ అలెక్సా సపోర్ట్
- నాయిస్ క్యాన్సలేషన్, డ్యూయల్-అరే మైక్రోఫోన్‌లతో 5 ఎంపీ వెబ్‌క్యామ్
- యూఎస్‌బీ టైప్ సీ పోర్టులు, టైప్ సీ అడాప్టర్ సపోర్ట్, హెచ్‌డీఎంఐ, హెడ్‌ఫోన్ జాక్
హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్ 360 ఫీచర్లు
- మల్టీటచ్ సపోర్ట్, 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
- 13వ జనరల్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్
- 16జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్‌డీ
- ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ జీపీయూ
- 43 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, మాన్యువల్ వెబ్‌క్యామ్ షట్టర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాంగ్, ఒలుఫ్‌సెన్ స్పీకర్లు.
ధర, లభ్యత
హెచ్‌పీ 14, హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్‌ల ధర రూ. 39,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14 ప్రారంభ ధర రూ. 81,999గా ఉంది. అయితే హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్ 360 ప్రారంభ ధర రూ. 57,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్స్ అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..