AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ బ్యాటరీ, తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో హానర్ ప్లే 11! పూర్తి వివరాలు

Honor Play 11 5G.. Honor నుంచి కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. Play సిరీస్‌లో భాగంగా Honor Play 11ను విడుదల చేసింది. 8,300mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, Snapdragon చిప్‌సెట్‌ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటికి తోడు IP69K రేటింగ్ ఉండటం వల్ల నీరు, దుమ్ము నుంచి అదనపు రక్షణ లభించనుంది.

భారీ బ్యాటరీ, తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో హానర్ ప్లే 11! పూర్తి వివరాలు
Honor Play 11 5g
Nikhil
|

Updated on: Sep 19, 2026 | 7:00 AM

Share

తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ, పెద్ద స్క్రీన్, మంచి పనితీరు కోరుకునే వారికి కొత్త ఫోన్ ఆసక్తికరంగా మారింది. మూడు మెమరీ వేరియంట్లలో వచ్చిన ఈ మోడల్‌లో Android 16 ఆధారిత MagicOS 10ను అందించారు. కెమెరా, 45W వేగవంతమైన ఛార్జింగ్, AI సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ధర రూ.20 వేల నుంచి..

ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6GB RAM + 128GB ధర CNY 1,399గా ఉంది. 8GB RAM + 128GB ధర CNY 1,599 కాగా, 8GB RAM + 256GB ధర CNY 1,899గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇవి సుమారు రూ.20,000, రూ.22,800, రూ.27,000గా ఉంటాయి. Desert Gold, Mist Purple, Meteor Silver, Phantom Black రంగుల్లో లభిస్తుంది.

పెద్ద స్క్రీన్..

Honor Play 11లో 6.88 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది 1592 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1020 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. పనితీరు కోసం Qualcomm Snapdragon 4 Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గరిష్ఠంగా 8GB RAM, 256GB స్టోరేజ్ లభిస్తుంది. Android 16 ఆధారిత MagicOS 10పై ఫోన్ పనిచేస్తుంది. AI ఫీచర్లను కూడా అందించారు. ఈ ఫోన్‌లో 8,300mAh బ్యాటరీ ఉండటం ప్రత్యేక ఆకర్షణ. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

కెమెరాల విషయానికి వస్తే వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు మరో సెకండరీ కెమెరా ఉంటుంది. ముందు 5MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP69K రేటింగ్ అందించారు. అయితే ఈ రేటింగ్ ఉన్నప్పటికీ ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగా ఎక్కువసేపు నీటిలో ఉంచడం మంచిది కాదు. కనెక్టివిటీ కోసం Wi-Fi 5, Bluetooth 4.2, NFC సదుపాయాలు ఉన్నాయి.

Follow Us