ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్‌కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడి గింజలతో ఇంట్లోనే రుచికరమైన, ఐరన్ సమృద్ధిగా ఉండే బట్టర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు గుమ్మడి గింజలను దోరగా వేయించి చల్లార్చాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్‌లో లేదా ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. రుచి కోసం కొద్దిగా తేనె మరియు చిటికెడు ఉప్పు కలుపుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన స్ప్రెడ్ శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించడానికి మార్కెట్లో లభించే కృత్రిమ సప్లిమెంట్లకు బదులుగా, పూర్తిగా సహజసిద్ధమైన పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ఉత్తమం. గుమ్మడి గింజలు ఒక సూపర్‌ఫుడ్‌గా పేరుగాంచాయి. వీటిలో ఐరన్, ప్రొటీన్లు, మెగ్నీషియం, జింక్, రోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. మార్కెట్లో కొనుగోలు చేసే పంప్‌కిన్ సీడ్ బటర్‌లో కొన్నిసార్లు రసాయనాలు లేదా కల్తీ ఉండే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఎంతో సులభంగా ఇంట్లోనే శుభ్రంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పంప్‌కిన్ సీడ్ బటర్ తయారీకి కావలసిన పదార్థాలు
గుమ్మడి గింజలు: 1 కప్పు
తేనె : 1 నుండి 2 చెంచాలు లేదంటే..రుచికి తగినట్టుగా
ఉప్పు: చిటికెడు
తయారీ విధానం:
ముందుగా ఒక పాన్‌ను స్టవ్ మీద పెట్టి, అందులో కప్పు గుమ్మడి గింజలను వేయాలి. మంటను తక్కువగా ఉంచి 4 నుండి 5 నిమిషాల పాటు గింజలు మాడిపోకుండా దోరగా వేయించాలి. గింజలు వేగిన తర్వాత వాటిని స్టవ్ మీద నుండి దించి పూర్తిగా చల్లారనివ్వాలి.
చల్లారిన గింజలను మిక్సీ జార్‌లో లేదా ఫుడ్ ప్రాసెసర్‌లో వేయాలి. మొదట వీటిని పౌడర్‌లా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మిక్సీని కొద్దిసేపు ఆపుతూ, ఆన్ చేస్తూ కంటిన్యూగా బ్లెండ్ చేయాలి. కొద్దిసేపటికి గింజలలో ఉండే సహజమైన నూనెలు బయటికి వచ్చి, మిశ్రమం కాస్త చిక్కగా మారి క్రీమీ బటర్‌లా తయారవుతుంది.
బటర్ తయారైన తర్వాత అందులో రుచి కోసం కొద్దిగా తేనె, ఒక చిటికెడు ఉప్పు వేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. అంతే, ఎంతో పౌష్టికాహారంతో కూడిన పంప్‌కిన్ సీడ్ బటర్ సిద్ధమవుతుంది. దీన్ని ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేసుకుని వాడుకోవచ్చు.
దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
రక్తహుడుత నివారణ: గుమ్మడి గింజల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగవుతాయి. ఇది రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
శక్తినిస్తుంది: ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందిస్తాయి. దీన్ని బ్రెడ్, టోస్ట్ లేదా చపాతీపై రాసుకుని తినవచ్చు, లేదా స్మూతీలలో కలుపుకుని ఆస్వాదించవచ్చు.




