AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Tips: పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవండి చాలు!

పండుగలు, ప్రత్యేక సందర్భాలలో దాదాపు ప్రతి ఇళ్లలోనూ పూరీలు తయారు చేస్తుంటారు. అయితే కొందరి ఇంట్లో పూరీలు సరిగ్గా పొంగవు. వేయించిన తర్వాత ఎక్కువగా నూనెను పీల్చుకుంటాయి. ప్రముఖ మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా ప్రకారం, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే పూరీలు గుల్లగా రావడంతో పాటు తక్కువ నూనెను పీల్చుకుంటాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

Cooking Tips: పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవండి చాలు!
Poori Making Tips
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2026 | 4:27 PM

Share

మన దేశంలో పండుగలు, వేడుకలు అంటేనే పిండి వంటలు గుర్తుకువస్తాయి. అందులోనూ ఆలూ కూరతో వేడివేడిగా, గుల్లగా పొంగిన పూరీలు తినడంలో ఉండే మజ్జే వేరు. అయితే చాలా మంది ఇళ్లలో పూరీలు చేసేటప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే, పూరీలు వేయించిన తర్వాత ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పూరీ రుచి కూడా తగ్గిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా కొన్ని అద్భుతమైన, సులభమైన చిట్కాలను పంచుకున్నారు.

నూనె తక్కువగా పీల్చే పూరీలు చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు

పిండిని గట్టిగా కలుపుకోవాలి:

ఇవి కూడా చదవండి

మంచిగా పొంగే, నూనె పీల్చని పూరీలు తయారవ్వాలంటే పిండి కలపడంలోనే అసలు రహస్యం ఉంది. సాధారణంగా చపాతీలకు కలిపినట్లు పిండిని మెత్తగా కలుపుకోకూడదు. పూరీ పిండిని ఎప్పుడూ గట్టిగానే తడుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉంటే పూరీలు వేయించేటప్పుడు నూనెను ఎక్కువగా పీల్చుకునే అవకాశం ఉంది.

కలిపిన వెంటనే పూరీలు చేయాలి:

చాలామంది పిండిని కలిపి చాలా సేపు నానబెడుతుంటారు. కానీ మాస్టర్‌షెఫ్ పంకజ్ ప్రకారం, పూరీ పిండిని కలిపిన తర్వాత ఎక్కువ సేపు అలాగే ఉంచకూడదు. పిండి సిద్ధం చేసిన వెంటనే పూరీలు వత్తుకుని వేయించడం ప్రారంభించాలి. పిండిని ఎక్కువసేపు నానబెడితే అందులోని తేమ కారణంగా పూరీలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి.

నూనె సరైన వేడిలో ఉండాలి:

పూరీలు వేసేటప్పుడు కచ్చితంగా నూనె బాగా వేడెక్కి ఉండాలి. నూనె గనుక సరిగ్గా కాగకపోతే పూరీలు సరిగ్గా పొంగవు, విపరీతంగా నూనెను పీల్చుకుంటాయి.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇళ్లలోనే ఎంతో రుచికరమైన, నూనె ఎక్కువగా పీల్చని గుల్లని పూరీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఈ పండుగ పూట ఎలాంటి ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించకుండా చక్కని పూరీలను ఆస్వాదించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us