Redmi Note 10: రెడ్‌మీ యూజర్లకు గుడ్ న్యూస్.. నోట్ 10పై రూ. 2 వేలు తగ్గింపు.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Redmi Note 10: భారత మొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రెడ్‌మీ. ఈ క్రమంలోనే రోజుకో కొత్త మోడల్‌ను తీసుకొస్తూ...
Redmi Note 10: భారత మొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రెడ్‌మీ. ఈ క్రమంలోనే రోజుకో కొత్త మోడల్‌ను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మొదట్లో రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌తో భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది రెడ్‌మీ. ఇక తాజాగా శనివారం రెడ్‌మీ ఫ్లాష్ సేల్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 10 ప్రోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కంపనీ ఫోన్ ధరను ఏకంగా రూ. 2 వేలు తగ్గించడం విశేషం. నిజానికి ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 17,999 కాగా సేల్‌లో భాగంగా రూ. 15,999కే అందించారు.ఇక నోట్ 10 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 15,999కి అందుబాటులో ఉండగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 16,999కి అందుబాటులో ఉంది. ఇక మూడో వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ మొబైల్ ఫోన్‌ను రూ. 18,999కి అందుబాటులో ఉంచారు.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..
* 6.67 ఇంచ్‌లు ఫుల్ హెచ్‌డీ+సూప్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 120 హెచ్‌జెడ్ రీఫ్రేష్ రేట్‌ను అందించారు.
* 732జీ సన్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ దీని ప్రత్యేకత.
* ఇక బ్యాటరీ విషయానికొస్తే 5,020 ఎమ్ఏహెచ్‌తో 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందించారు.
* సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ మరో ఆకర్షణ.
* 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా దీని సొంతం.
Also Read: కేవలం 100 రూపాయల కోసం వ్యక్తిని కిరాతకంగా చంపిన దంపతులు.. అసలు ఏం జరిగిందంటే..?
NASA: అంగారకుడిపై 11 మిలియన్ల మానవుల పేర్లు.. ఒక మోర్స్ కోడ్ సందేశం..నాసా ఏర్పాటు!
ఈ మూడు కార్లు అతి తక్కువ ధర.. అధిక మైలేజ్..! లీటర్‌కి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాయో తెలుసా..?