Tecno spark 10 pro: అతి తక్కువ ధర.. అత్యద్భుత ఫీచర్లు.. ఏకంగా 8జీబీ ర్యామ్.. ఇది మామూలు ఫోన్ కాదు..
మీరు ఒకవేళ అతి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ర్యామ్ సైజ్, మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటుంటే ఈ కథనం మీ కోసమే.. కేవలం పది వేల లోపు ధరలో నే ముందు, వెనుక మంచి కెమెరాలతో కూడిన ఫోన్ టెక్నో కంపెనీ తీసుకొచ్చింది.
ఫోన్ అందరికీ అవసరమే అయినా.. ఒక్కొక్కరూ ఒక్కో విధమైన ప్రయోజనాల కోసం దానిని వినియోగిస్తారు. కొందరికి ర్యామ్ సైజ్ ఎక్కువ కావాలి.. మరికొందరికి కెమెరా క్వాలిటీ కావాలి..ఇంకొందరికి బ్యాటరీ సామర్థ్యం అధికంగా ఉండాలి.. ఇంకా రేటు బడ్జెట్లో ఉండాలని కోరుకొంటారు. అయితే అన్ని ఒక ఫోన్లో దొరకడం కష్టం. అలా దొరకినా దాని ధర ఆకాశంలో ఉంటుంది. మీరు ఒకవేళ అతి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ర్యామ్ సైజ్, మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటుంటే ఈ కథనం మీ కోసమే.. కేవలం పది వేల లోపు ధరలో నే ముందు, వెనుక మంచి కెమెరాలతో కూడిన ఫోన్ టెక్నో కంపెనీ తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్ 10 ప్రో పేరుతో దీనిని ప్రకటించింది. ఈ ఫోన్ సెల్ఫీ ప్రియులకు మంచి అనుభూతిని ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
ఇది ఫోన్..
టెక్నో కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. టెక్నో స్పార్క్ 10 ప్రో పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్ ఒక సెల్ఫీ-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్. ఇది 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మీడియా టెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్ తో పంచ్-హోల్ డిస్‌ప్లే ఉన్నాయి.
స్పెసిఫికేషన్లు ఇవి..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌తో 2,460 x 1,080 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది 32ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. పరికరం ముందు భాగంలో ఎల్ ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఇక వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, ఏఐలెన్స్ క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. దీనిలో 8జీబీ ర్యామ్, 8జీబీ వర్చువల్ ర్యామ్ అలాగే 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తోంది. దీనిలోని బ్యాటరీ 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సోర్టు చేస్తుంది. అలాగే ఫోన్ వెనుక వైపు గ్లాస్ ప్రోటెక్షన్ కలిగి ఉంటుంది. పరికరం స్టార్రీ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
ధర ఎంతంటే..
టెక్నో స్పార్క్ 10 ప్రో ధర ను కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ పరికరం రెండు మెమరీ కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాల అంచనా. 8జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు $122 (దాదాపు రూ. 10,000) ఉంటుందని అంచనా వేయగా, 256GB వేరియంట్ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. అధికారికంగా ధర తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..