Samsung Galaxy Z Tab: అదిరే ఫీచర్లతో మడతపెట్టేసే ట్యాబ్లెట్.. మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..

ఫోల్డబుల్ మోడల్ ఫోన్లలో శామ్సంగ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇటీవల శామ్సంగ్ గేలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గేలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఫోల్డబుల్ ట్యాబ్లెట్ ను విడుదల చేస్తోంది.

Samsung Galaxy Z Tab: అదిరే ఫీచర్లతో మడతపెట్టేసే ట్యాబ్లెట్.. మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..
Samsung Galaxy Tab Z
Follow us
Madhu

|

Updated on: Apr 12, 2023 | 5:20 PM

స్మార్ట్ ఫోన్లలో లేటెస్ట్ ట్రెండ్ ఫోల్డబుల్ ఫోన్లు. ఇటీవల కాలంలో వీటిపై టెక్ ప్రియులు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ల ఉత్పత్తి, మార్కెటింగ్ లో శామ్సంగ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మార్కెట్లో చాలా కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను ఆవిష్కరించినా.. ఎక్కువ మోడళ్లతో అత్యధిక అమ్మకాలు చేస్తున్నది మాత్రం శామ్సంగ్ కంపెనీ మాత్రమే. శామ్సంగ్ గేలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గేలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 వంటి మోడళ్లను కూడా ఇటీవల ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఇదే మార్గంలో ఒప్పో, వివో, జియోమీ, మోటోరోలా కూడా తమ ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేశాయి. యాపిల్, రియల్ మీ, గూగుల్ వంటి సంస్థలు కూడా ఈ ఫోల్డబుల్ డిజైన్ ఫ్లాగ్ షిప్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో శామ్సంగ్ మరో అడుగు ముందుకు వేసి ఫోల్డబుల్ ట్యాబ్లెట్ ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ట్యాబ్(Samsung Galaxy Z Tab) పేరిట దీనిని మార్కెట్లోకి తెచ్చేందుకు అంతా సిద్దం చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ఫోల్డబుల్ ఫోన్లలో నంబర్ వన్..

ఫోల్డబుల్ మోడల్ ఫోన్లలో శామ్సంగ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇటీవల శామ్సంగ్ గేలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గేలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఫోల్డబుల్ ట్యాబ్లెట్ ను విడుదల చేస్తోంది. కంపెనీ తన ఎస్9 సిరీస్ ట్యాబ్లెట్లు గేలాక్సీ ట్యాబ్ ఎస్9, గేలాక్సీ ట్యాబ్ ఎస్9 ప్లస్, గేలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా మోడళ్లను ఈ ఏడాది చివరిలో లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. వాటితో పాటే ఈ ఫోల్డబుల్ ట్యాబ్ గేలాక్సీ జెడ్ ను లాంచ్ చేసే అవకాశం ఉంది.ఇది శామ్సంగ్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ట్యాబ్ కావడం విశేషం.

గేలాక్సీ ట్యాబ్ ఎస్9..

శామ్సంగ్ ఇప్పటివరకు ఫోల్డబుల్ టాబ్లెట్‌కు సంబంధించి ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. అయితే లాస్ వెగాస్‌లో ఇటీవల నిర్వహంచిన సీఈఎస్ 2023 సమయంలో కంపెనీ ఫోల్డబుల్ టాబ్లెట్ కాన్సెప్ట్‌లను టీజ్ చేసింది . అయితే 2023 ద్వితీయార్థంలో గేలాక్సీ ట్యాబ్ ఎస్9 ను ఆవిష్కరిస్తుంది. ఆ తర్వాత గేలాక్సీ ట్యాబ్ ఎస్9, గేలాక్సీ ట్యాబ్ ఎస్9 ప్లస్, గేలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా మోడళ్లు వచ్చే అవకాశం ఉంది. కొన్న నివేదికల ప్రకారం గెలాక్సీ ట్యాబ్ ఎస్9 లో ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతాయి. అవి నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..