Smartphones: టాప్ బ్రాండ్లు.. సూపర్ ఫీచర్లు.. ఆ రెండు ఫోన్లలో ఏది బెస్ట్.. పూర్తి వివరాలు ఇవి..
Oppo A58 4G vs Samsung Galaxy F34 5G: నిన్నమొన్నటి వరకూ 4జీ ఫోన్లు మాత్రమే మార్కెట్లో కనిపించేవి.. ఇటీవల 5జీ ట్రెండ్ షురూ అయ్యింది. టాప్ బ్రాండ్లు కూడా 5జీలో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. వీటిల్లో ఏది బెస్ట్? అంటే చెప్పడం కష్టమే. అందుకే ఇటీవల విడుదలైన రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య తేడాలను మీకు వివరిస్తున్నాం. వాటిల్లో మొదటిది ఒప్పో ఏ58 4జీ కాగా.. మరొకటి శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ. ఈ రెండూ కూడా రూ. 20,000లోపు ధరలో లాంచ్ అయ్యాయి.

మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు కొదువు లేదు. లెక్కకు మించిన బ్రాండ్లలో ఫోన్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే వాటిల్లో జనాదరణ పొందుతున్నవి కొన్నే ఉంటాయి. కొన్ని టాప్ బ్రాండ్ ఫోన్లను మాత్రమే జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. నిన్నమొన్నటి వరకూ 4జీ ఫోన్లు మాత్రమే మార్కెట్లో కనిపించేవి.. ఇటీవల 5జీ ట్రెండ్ షురూ అయ్యింది. టాప్ బ్రాండ్లు కూడా 5జీలో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. వీటిల్లో ఏది బెస్ట్? అంటే చెప్పడం కష్టమే. అందుకే ఇటీవల విడుదలైన రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య తేడాలను మీకు వివరిస్తున్నాం. వాటిల్లో మొదటిది ఒప్పో ఏ58 4జీ కాగా.. మరొకటి శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ. ఈ రెండూ కూడా రూ. 20,000లోపు ధరలో లాంచ్ అయ్యాయి. రెండింటిలోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ధర, లభ్యత.. ఒప్పో ఏ58 4జీ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీని ధర రూ. 14,999గా ఉంటుంది. ఇది ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉంది. పలు అదనపు బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. అదే విధంగా శామ్సంగ్ ఎఫ్34 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 18,999గా ఉంది. అదే సమయంలో 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 20,999గా ఉంది. ఇది ఫ్లిప్ కార్ట్ దీనిపై కూడా అదనపు పలు బ్యాంకు ఆఫర్లు ఉంటాయి.
డిస్ ప్లే.. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 6.46 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 సంరక్షణ ఉంటుంది. ఒప్పో ఏ58 4జీ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.




ప్రాసెసర్.. ఒప్పో ఏ58 4జీ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ హీలియో జీ85 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. గెలాక్సీ ఎఫ్34 5జీ ఆక్టా కోర్ ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ.
ఆపరేటింగ్ సిస్టమ్.. రెండు స్మార్ట్ ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తాయి. ఒప్పో ఏ58 4జీ కలర్ ఓఎస్ 13.1, గెలాక్సీ ఎఫ్ 34 5జీ వన్ యూఐ 5.1 ఆధారంగా పనిచేస్తుంది.
కెమెరా క్వాలిటీ.. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దానిలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ మెగా పిక్సల్ మాక్రో కెమెరా ఉంటుంది. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా. ఒప్పో ఏ58 4జీ ఫోన్లో వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దానిలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ.. ఒప్పో ఏ58 4జీ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల వైర్డ్ సూపర్ వీఓఓసీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ ఫోన్లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
అదనపు ఫీచర్లు.. రెండూ ఫోన్లలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. జీపీఎస్, ఎన్ఎఫ్సీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, యూఎస్బీ టైప్ సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..