Microsoft Windows: విండోస్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వెంటనే మీ OS ను..

కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నారా.. అయితే ఈహెచ్చరిక మీ కోసమే.. వెంటనే మీరు మీ OS ను అప్ డేట్ చేసుకోవాలని

Microsoft Windows: విండోస్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వెంటనే మీ OS ను..
Microsoft Windows
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 26, 2022 | 7:41 PM

Microsoft Windows: కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నారా.. అయితే ఈహెచ్చరిక మీ కోసమే.. వెంటనే మీరు మీ OS ను అప్ డేట్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూకరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-IN) సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ విండోస్ OS లో లోపాలను గుర్తించినట్లు తెలిపింది. వీటి సాయంతో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ఓఎస్ సెక్కూరిటీ సిస్టమ్ విండోస్ డిఫెండర్ పనిచేయకుండా చేసి సైబర్ దాడికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. యూజర్ కు సంబంధించిన సమాచారం సులువుగా సైబర్ నేరగాళ్లకు చేరడంతో యూజర్ ప్రమేయం లేకుండా కంప్యూటర్ ను తమ అధీనంలోకి తీసుకోగలరని తెలిపింది. విండోస్ డిఫెండర్ లోని క్రెడెన్షియల్ గార్డ్ లోని బగ్ కారణంగా ఈసమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈబగ్ వల్ల 43 మైక్రోసాఫ్ట్ వెర్షన్లలో సమస్య తలెత్తినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.5 బిలియన్‌ యూజర్లు విండోస్‌ ఓఎస్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఈక్రమంలో భారత్‌లోని విండోస్‌ యూజర్లు వెంటనే తమOSను అప్‌డేట్ చేసుకోవాలని (CERT-IN) తమ నివేదికలో పేర్కొంది. ఓఎస్‌ అప్‌డేట్ కోసం స్టార్ట్‌ మెనూపై క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్‌లోకి వెళితే విండోస్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చివరిగా మీ ఓఎస్‌ ఎప్పుడు అప్‌డేట్ అయిందనేది తెలుస్తుంది. మీ కంప్యూటర్‌ ఆటో అప్‌డేట్‌ ఫీచర్‌ ఎనేబుల్ చేసుకుంటే మీ విండోస్‌ ఓఎస్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అవుతుంది. అలానే క్రెడెన్షియల్‌ గార్డ్‌ బగ్‌ కారణంగా ప్రభావితమైన విండోస్‌ ఓఎస్‌ వెర్షన్‌ల జాబితాను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. వీటిలో విండోస్‌ 11, విండోస్‌ 10, విండోస్‌ సర్వర్‌ 2022, 2019, 2016లు ఉన్నాయి. ఈ లింక్ ను క్లిక్ చేసి నేరుగా CERT-IN వెబ్ సైట్ లోకి వెళ్లి ఓఎస్ కు సంబంధించిన వివరాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ