Google Photos: మీ ఫోన్లో తీసిన ఫొటోలకు సినిమాటిక్ ఎఫెక్ట్స్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది..
చాలా మంది గూగుల్ ఫోటోస్ వినియోగదారులు ఈ సినిమాటిక్ ఎఫెక్ట్ లతో కూడిన ఫోటోలను తయారు చేసేలా కొత్త ఫీచర్ తీసుకురావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ దీనిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని మీరు గూగుల్ ఫొటోస్ లైబ్రెరీ ట్యాబ్ లో యుటిలిటీస్ లోకి వెళ్తే ఈ ఆప్షన్ మీకు కనిపిస్తోంది.
ఫొటోలను సేవ్, షేర్, ఎడిట్ చేసుకునేందుకు ‘గూగుల్ ఫొటోస్’ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను సింక్ చేసి, స్టోర్ చేసుకునే వీలుండడంతో ఈ యాప్ చాలా పాపులర్ అయింది. ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది గూగుల్. ఇందులో భాగంగా సినిమాటిక్ ఫొటోస్ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై పలు పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ సాయంతో సాధారణ ఫొటోలను మూవింగ్ ఫొటోస్‌గా మార్చవచ్చు. అప్పుడు ఫొటోలు మరింత రియలిస్టిక్‌గా, ఆకర్షణీయంగా మారతాయి. సినిమాటిక్ ఫొటోస్ ఫీచర్ అనేది మూవీ కాన్సెప్ట్ నుంచి డెవలప్ చేసింది. ఇది ఫొటోలకు సినిమాటిక్ లుక్ అందిస్తుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వినియోగదారుల డిమాండ్ మేరకే..
ఆండ్రాయిడ్ పోలీస్ చెబుతున్న దాని ప్రకారం చాలా మంది గూగుల్ ఫోటోస్ వినియోగదారులు ఈ సినిమాటిక్ ఎఫెక్ట్ లతో కూడిన ఫోటోలను తయారు చేసేలా కొత్త ఫీచర్ తీసుకురావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ దీనిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని మీరు గూగుల్ ఫొటోస్ లైబ్రెరీ ట్యాబ్ లో యూటిలిటీస్ ఆప్షన్లో మీకు కనిపిస్తోంది.
ఎలా పనిచేస్తుందంటే..
మీరు సినిమాటిక్ ఫటో క్రియేటర్ ఫీచర్ వినియోగించాలంటే ముందు ఒక ఫొటోను ఎంపిక చేసుకొని, ఎంత సేపు యానిమేట్ అవ్వాలో సమయాన్ని నిర్ధారించాలి. ఆ తర్వాత గూగుల్ ఫోటోస్ మీరు ఎంపిక చేసిన ఫోటోను స్లో మోషన్ జూమ్ యానిమేషన్ ని క్రియేట్ చేస్తుంది. దీని క్లారిటీ మాత్రం మీరు ఎంపిక చేసిన ఫొటోను బట్టి ఉంటుంది.
మ్యాజిక్ ఎరేజర్ టూల్..
2022 ఫిబ్రవరిలో గూగుల్ వన్ సబ్ స్క్రైబర్స్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలెజెన్స్(ఏఐ)ఆధారంగా పనిచేసే మ్యాజిక్ ఎరేజర్ టూల్ ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్, పిక్సల్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది. ఇది ఏం చేస్తుందంటే.. ఫొటోల్లోని డిస్టర్బెన్సెస్ ను గుర్తిస్తుంది. అలాగే అవసరం లేని డిస్ట్రాక్షన్స్ ను తొలగిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఫొటోపై అవసరం లేని చోట బ్రష్ చేసి దానిని కనిపించకుండా చేయొచ్చు.
మరిన్ని ఫీచర్లు..
- గూగుల్ ఫొటోస్ యాప్ లో ఆటోమేటిక్ బ్యాకప్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతిరోజూ ఫోన్లో సేవ్ అవుతున్న చిత్రాలు, వీడియోలను బ్యాకప్ చేస్తుంది.
- అలాగే లింక్ ద్వారా ఇతర వినియోగదారులతో ఫోటోలు, ఆల్బమ్‌లను షేర్ చేయడానికి కూడా యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది.
- ఫొటోల ఎడిటింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ అంతర్నిర్మిత యాప్‌తో, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫోటోలలోని ఎక్స్‌పోజర్, కలర్ బ్యాలెన్స్‌ను కూడా సెట్ చేయొచ్చు.
- ఐఫోన్ వినియోగదారులు తమ పరికరాలలో సేవ్ చేసిన ఫొటోలను క్లౌడ్ ఆధారిత ఫొటో-స్టోరింగ్ సేవకు బదిలీ చేయడానికి కూడా యాప్ అనుమతిస్తుంది. అయితే, అలా చేయడానికి, ఐఫోన్ వినియోగదారులు ‘బ్యాకప్ & సింక్’ ఫీచర్‌ను ప్రారంభించాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..