AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge Plans: ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ న్యూస్… ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్ ప్రకటించిన టెలికం కంపెనీలు

ఐపీఎల్‌ను వీక్షించేందుకు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాయి. ఈ ప్లాన్‌లతో రోజు వారి అవసరాలకు సరిగ్గా సరిపోయే ప్రణాళికను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒక ఐపీఎల్ మ్యాచ్‌ను హై డెఫినిషన్‌లో ప్రసారం చేయడం వల్ల గణనీయమైన మొత్తంలో డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది. 4 కే స్ట్రీమింగ్‌కు ఒక్కో మ్యాచ్‌కు 22 జీ  కంటే ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడానికి అన్ని టెలికాం కంపెనీలు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్‌ను లాంచ్ చేశాయి.

Recharge Plans: ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ న్యూస్… ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్ ప్రకటించిన టెలికం కంపెనీలు
Recharge Plans
Nikhil
|

Updated on: Mar 24, 2024 | 6:43 PM

Share

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 శుక్రవారం ప్రారంభమైన సంగతి అందరికీ విధితమే. క్రికెట్ ఔత్సాహికులు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, వీఐ, జియో ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ చెప్పాయి. ఐపీఎల్‌ను వీక్షించేందుకు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాయి. ఈ ప్లాన్‌లతో రోజు వారి అవసరాలకు సరిగ్గా సరిపోయే ప్రణాళికను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒక ఐపీఎల్ మ్యాచ్‌ను హై డెఫినిషన్‌లో ప్రసారం చేయడం వల్ల గణనీయమైన మొత్తంలో డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది. 4 కే స్ట్రీమింగ్‌కు ఒక్కో మ్యాచ్‌కు 22 జీ  కంటే ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడానికి అన్ని టెలికాం కంపెనీలు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్‌ను లాంచ్ చేశాయి. టెలికాం కంపెనీలు రిలీజ్ చేసిన రీచార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎయిర్‌టెల్ ప్లాన్స్

ఎయిర్‌టెల్ రూ. 699 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 3 జీబీ 4జీ డేటాతో పాటు 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ ఐపీఎల్ సీజన్ అంతటా నిరంతరాయంగా స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. అనుకూలమైన స్మార్ట్‌ఫోన్‌లలో కాంప్లిమెంటరీ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత 5 జీ డేటా యాక్సెస్‌తో వస్తుంది. దీనితో పాటు అదనపు డేటా అవసరమైన వారికి ఎయిర్‌టెల్ రూ. 29 నుంచి  డేటా టాప్-అప్ ప్లాన్‌లను అందిస్తుంది.

జియో

జియో రూ. 444 రీఛార్జ్ ప్లాన్ 100 జీబీ డేటాతో 60 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే రూ. 667 రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో 150 జీబీ డేటాను అందిస్తుంది. అదనంగా జియో ఫెస్టివల్ ఆఫర్ అయిన రూ. 999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంది.  ఈ ప్లాన్ కింద రోజుకు 3 జీబీ 4జీ డేటాతో పాటు అపరిమిత 5జీ యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే ప్లాన్ చెల్లుబాటు 84 రోజులు. అలాగే జియో రూ. 399 ధరతో నెలవారీ రీఛార్జ్ ఎంపికను కలిగి ఉంది. ఈ ప్లాన్‌లో అదనంగా 6 జీబీ డేటాను అంటే రోజుకు 3 జీబీ 4జీ డేటాను పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

వీఐ ప్లాన్స్ 

వీఐ ఐపీఎల్ ఔత్సాహికుల కోసం కొన్ని ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్ ఎంపికలను అందిస్తుంది. రూ.699 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 56 రోజుల వాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. దీనితో పాటు సబ్‌స్క్రైబర్‌లు 12 ఏఎం నుండి 6 ఏఎం వరకు అపరిమిత 4 జీబీ డేటాను పొందవచ్చు. అలాగే వీఐ సినిమాలు, టీవీ సభ్యత్వాలను కూడా పొందవచ్చు. అదనపు డేటా అవసరమయ్యే వినియోగదారులు వీఐ రూ. 475 రీఛార్జ్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఇది 28 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 4 జీబీ డేటాను అందిస్తుంది. దీనికి అదనంగా వీఐ 1.5 జీబీ డేటా కోసం రూ. 25 నుంచి డేటా వోచర్‌లను అందిస్తుంది. ప్రత్యామ్నాయంగా, వినియోగదారులు 56 రోజుల పాటు 100 జీబీ డేటాను అందించే రూ. 418 డేటా ప్లాన్‌తో ప్రాథమిక రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
లేడి క్వీన్.. చదువుకోలేదని బంధువుల ఎగతాళి..ఇప్పుడు కోట్లు సంపాదన!
లేడి క్వీన్.. చదువుకోలేదని బంధువుల ఎగతాళి..ఇప్పుడు కోట్లు సంపాదన!
ఒక్క డ్రింక్ తో పొట్టని,బరువుని ఆరోగ్యాంగా తగ్గించుకోండి
ఒక్క డ్రింక్ తో పొట్టని,బరువుని ఆరోగ్యాంగా తగ్గించుకోండి
MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై ధోని ఏమన్నాడంటే?
MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై ధోని ఏమన్నాడంటే?
ప్రపంచానికి పొంచి ఉన్న భారీ ముప్పు.. హెచ్చరించిన IEA
ప్రపంచానికి పొంచి ఉన్న భారీ ముప్పు.. హెచ్చరించిన IEA
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..