AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Fraud: నకిలీ వెబ్‌సైట్‌తో రూ. 1.38లక్షలు హాంఫట్.. లబోదిబోమన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్..

ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరే సైబరాసురుల చేతికి చిక్కి.. ఏకంగా రూ. 1.38లక్షలు పోగొట్టుకున్నాడు. అతడిని చాలా తెలివిగా మోసం చేసి సొమ్ములు కాజేశారు సైబరాసురులు. విషయం అర్థమైన తర్వాత అతడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Cyber Fraud: నకిలీ వెబ్‌సైట్‌తో రూ. 1.38లక్షలు హాంఫట్.. లబోదిబోమన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్..
Cyber Crime
Madhu
|

Updated on: Mar 23, 2024 | 8:24 AM

Share

ప్రస్తుతం ప్రపంచం ఇంటర్నెట్ గుప్పిట్లో ఉంది. ఎక్కడ ఏ మూలన ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా నిమిషాలలో సాధ్యమవుతుంది. విద్య, వినోదం, చదువు, వ్యాపారం ఇలా అన్ని విషయాల్లో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ఏది కావాలన్నా ఇంటర్నెట్లో వెతకడం, దానికి సంబంధించి సంస్థలను తెలుసుకోవడం, అక్కడి నంబర్లకు సంప్రదించడం ద్వారా మన పని చాలా సులభంగా పూర్తవుతుంది. దీనివల్ల సమయం, డబ్బులు ఆదా కావడంతో పాటు ఇంట్లోని ఉండి అన్ని పనులు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే సమయంలో నకిలీ వెబ్ సైట్లు, సైబర్ మోసగాళ్ల దాడులు కూడా ఎక్కువయ్యాయి. ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ ఖాతా బ్లాక్ అయ్యింది.. ఆధార్ వివరాలు చెప్పండి అంటూ ఫోన్లు వస్తున్నాయి. వాటిని నమ్మి మనం వివరాలు, ఓటీపీ నంబర్ చెప్పామో మన ఖాతాలో సొమ్ములు ఖాళీ అవుతున్నాయి. పెద్దగా చదువుకోని వారితో పాటు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

ఇలాంటి ఓ మోసమే ఇటీవల వెలుగు చూసింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరే సైబరాసురుల చేతికి చిక్కి.. ఏకంగా రూ. 1.38లక్షలు పోగొట్టుకున్నాడు. అతడిని చాలా తెలివిగా మోసం చేసి సొమ్ములు కాజేశారు సైబరాసురులు. విషయం అర్థమైన తర్వాత అతడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నకిలీ వెబ్ సైట్ సాయంతో..

పూణేకి చెందిన 71 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. వెంటనే ఆన్ లైన్ లో వెతకగా అతడికి ఓ వెబ్‌సైట్‌ కనిపించింది. దానిలో ఉన్న నంబర్ ను సంప్రదించి, తనకు ఎలక్ట్రిక్ బైక్‌ కావాలని అడిగాడు. వెంటనే ఎలక్ట్రిక్ బైక్‌ కంపెనీ సిబ్బంది మంటూ కొందరు వాట్సాప్ లో చాటింగ్ చేశారు. రకరకాల బైక్ ల వివరాలు చెప్పారు. దానిలో ఒకదానికి ఎంపిక చేసుకున్నాక, డబ్బులు పంపాలని కోరారు. వారు చెప్పిన మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు రూ. 1,38,552 సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బదిలీ చేశాడు. తొందరలోనే బైక్ పంపిస్తామని వారు చెప్పారు. కానీ ఎంత కాలానికి బైక్ రాకపోవడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పాడు. పోలీసుల విచారణలో ఆ వెబ్ సైట్ నకిలీదిగా తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జాగ్రత్త అవసరం..

నకలీ వెబ్ సైట్ ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. కంపెనీల అధికారిక వెబ్ సైట్ లలో మాత్రమే ఆన్ లైన్ లో లావాదేవీలు చేయాలని కోరుతున్నారు. పెరిగిన టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉందో, సైబర్ మోసగాళ్ల కారణంగా కూడా భారీ నష్టం జరుగుతోందన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే