AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఇకపై వాయిస్‌ మెసేజ్‌లను..

వాట్సాప్‌లో టైపింగ్‌కు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్‌ మెసేజ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సహాయంతో క్షణాల్లో వాయిస్‌ మెసేజ్‌ను చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే వాయిస్‌ మెసేజ్‌ను కొన్ని సందర్భాల్లో అందరి ముందు వినే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. వాయిస్‌ నోట్...

Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఇకపై వాయిస్‌ మెసేజ్‌లను..
Whatsapp
Narender Vaitla
|

Updated on: Mar 21, 2024 | 6:35 PM

Share

ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌ కూడా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాల కోసం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఇంతకీ ఈ కొత్త ఫీచర్‌ ఏంటి.? దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్‌లో టైపింగ్‌కు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్‌ మెసేజ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సహాయంతో క్షణాల్లో వాయిస్‌ మెసేజ్‌ను చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే వాయిస్‌ మెసేజ్‌ను కొన్ని సందర్భాల్లో అందరి ముందు వినే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. వాయిస్‌ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ సహాయంతో వాయిస్‌ మెస్‌లను టెక్ట్స్ రూపంలో మార్చుకోవచ్చు.

దీంతో ఆడియో మెసేజ్‌ను వినకుండానే మెసేజ్‌ను చదివి తిరిగి రిప్లై ఇవ్వొచ్చన్నమాట. ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఇప్పటికే ఈ కొత్త ఫీచర్‌ను కొందరు ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకీ తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఫీచర్‌ కోసం యూజర్లు అదనంగా 150ఎంబీ యాప్‌ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్‌ నోట్స్‌ను టెక్ట్స్‌లోకి మార్చడానికి డివైజ్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ ఫీచర్లను వాట్సప్‌ వాడుకుంటుంది.

ప్రైవసీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాట్సాప్‌ చెబుతోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించే వారికి మెసేజ్‌ బబుల్స్‌లో వాయిస్‌ నోట్స్‌ టెక్ట్స్‌ రూపంలో కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారన్న దానిపై వాట్సాప్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!