AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi Civi 4 pro: షావోమీ నుంచి కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

షావోమీ సివి4 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో తీసుకొచ్చారు. 500 nits టైపికల్ బ్రైట్‌నెస్, 900 nits పీక్ బ్రైట్‌నెస్‌కి ఈ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో...

Xiaomi Civi 4 pro: షావోమీ నుంచి కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..
Xiaomi Civi 4 Pro
Narender Vaitla
|

Updated on: Mar 21, 2024 | 5:10 PM

Share

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ షావోమీ ఇటీవల బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. షావోమీ సివి 4 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. షావోమీ సివి4 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లోనూ లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

షావోమీ సివి4 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో తీసుకొచ్చారు. 500 nits టైపికల్ బ్రైట్‌నెస్, 900 nits పీక్ బ్రైట్‌నెస్‌కి ఈ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియోలు కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అదించారు.

అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఈ పోన్‌ను 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో లాంచ్‌ చేశారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ పోన్‌లో 4500 ఎమ్ఏహ్చ్‌ బ్యాటరీని అందించారు. 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ పని చేస్తుంది. అలాగే 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

ధర విషయానికొస్తే 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 34,999గా ఉండనుంది. అలాగే 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 36,999గా ఉండనుంది. ఇక ఈ ఫోన్‌ను స్ప్రింగ్ ఫీల్డ్ గ్రీన్, సాఫ్ట్ మిస్ట్ పింక్, బ్రీజ్ బ్లూ, బ్లాక్ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం చైనాలో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తున్నారన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..