AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్‌ ఫీచర్‌.. ఇకపై ఒకే సమయంలో ఎక్కువ ఛాట్స్‌

యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీకి పెద్దపీట వేస్తూ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో పిన్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో సహాయంతో ఇంపార్టెంట్ చాట్‌ అన్నింటికన్నా పైన కనపించేలా పిన్‌ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. అయితే ఈ పిన్‌ ఆప్షన్‌ ప్రస్తుతం కేవలం ఒక్క చాట్‌కు మాత్రమే అందుబాటులో...

WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్‌ ఫీచర్‌.. ఇకపై ఒకే సమయంలో ఎక్కువ ఛాట్స్‌
Whatsapp
Narender Vaitla
|

Updated on: Mar 22, 2024 | 3:11 PM

Share

వాట్సాప్‌.. ఈ మెసేజింగ్ యాప్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. దీంట్లో ఉన్న ఫీచర్లే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతకటి క్రేజ్‌ ఉంది. మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులో ఉన్న వాట్సాప్‌ క్రేజ్‌ తగ్గకపోవడానికి ఇదే కారణమని చెప్పొచ్చు.

యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీకి పెద్దపీట వేస్తూ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో పిన్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో సహాయంతో ఇంపార్టెంట్ చాట్‌ అన్నింటికన్నా పైన కనపించేలా పిన్‌ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. అయితే ఈ పిన్‌ ఆప్షన్‌ ప్రస్తుతం కేవలం ఒక్క చాట్‌కు మాత్రమే అందుబాటులో ఉండగా వాట్సాప్‌ ఇప్పుడు ఈ సంఖ్యను పెంచుతోంది.

ఇకపై యూజర్లు ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్‌, మెసేజ్‌లను పిన్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం 2.24.6.15 లేదా అంతకన్నా తర్వాతి వాట్సప్‌ వర్షన్లు ఉపయోగిస్తున్న వారికి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే త్వరలోనే మిగతా యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తాజా వాట్సప్‌ బీటా వర్షన్‌ అందుబాటులో గలవారు ఈ ఫీచర్‌ ద్వారా ఒక్కో ఛాట్‌కు మూడు వరకూ మెసేజ్‌ల చొప్పున.. ఐదు ఛాట్స్‌ను పిన్‌ చేసుకోవచ్చు.

అయితే ఈ కొత్త ఫీచర్‌ను ఇంకా అధికారంగా ప్రకటించలేదు. ఇక వాట్సాప్‌లో మెసేజ్‌ను పిన్‌ చేసుకోవాలంటే ఇందుకోసం ముందుగా ఛాట్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం ఛాట్‌ పైభాగాన కనిపించే పిన్‌ గుర్తు మీద క్లిక్‌ చేస్తే 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు అనే ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీకు నచ్చిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిన్‌ చేసిన మెసేజ్‌ను అన్‌పిన్‌ చేయాలనుకుంటే క్లిక్‌ చేసి అన్‌పిన్‌ చేసుకుంటే చాలు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!