AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone: ఐఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అంటే ఇదికదా.. కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న యాపిల్..

యాపిల్ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. దాని సాయంతో ఐఫోన్ బ్యాటరీలను సులభంగా మార్చే వీలు ఏర్పడనుంది. వినియోగదారులే ఇంటి వద్దనే ఐఫోన్ బ్యాటరీని రిప్లేస్ చేసుకునే వెసులుబాటు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా సాధ్యమవనుంది. ఈ కొత్త టెక్నాలజీ పేరు ఎలక్ట్రికల్లీ ఇడ్యూస్డ్ అధెసివ్ డీబాండింగ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Apple iPhone: ఐఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అంటే ఇదికదా.. కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న యాపిల్..
Iphone Battery Replacement
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 01, 2024 | 6:08 PM

Share

యాపిల్ ఐఫోన్ చాలా మందికి కలల ఫోన్. ఆ బ్రాండ్ ఇమేజ్ కోసం దానిని వాడాలని కోరుకుంటారు. అది చేతిలో ఉంటేనే ఒక స్టేటస్ సింబల్ గా ఫీల్ అయ్యే వారు ఉన్నారు. దానిలో టెక్నాలజీ, ఫీచర్స్ వంటివి చాలా ఆకట్టుకుంటాయి. అందుకనుకుగుణంగా యాపిల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు, సాంకేతికతను ఫోన్లలో జోడిస్తుంటుంది. ఈ క్రమంలో మరో అప్ డేట్ యాపిల్ నుంచి వచ్చింది. యాపిల్ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. దాని సాయంతో ఐఫోన్ బ్యాటరీలను సులభంగా మార్చే వీలు ఏర్పడనుంది. వినియోగదారులే ఇంటి వద్దనే ఐఫోన్ బ్యాటరీని రిప్లేస్ చేసుకునే వెసులుబాటు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా సాధ్యమవనుంది. యాపిల్ కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని త్వరలో ఎలక్ట్రానిక్ డివైజ్ రిపేరబిలిటీపై రానున్న యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా తీసుకురానుంది. ఈ కొత్త టెక్నాలజీ పేరు ఎలక్ట్రికల్లీ ఇడ్యూస్డ్ అధెసివ్ డీబాండింగ్. దీని సాయంతో బ్యాటరీలను కొంచెం కరెంట్ పాస్ చేయించడం ద్వారా దానిని బయటకు తీయొచ్చు. ప్రస్తుతం ఈ బ్యాటరీల కోసం అథెసివ్ స్ట్రిప్స్ మెథడ్ అందుబాటులో ఉంది.

టెక్నీషియన్లకు మరింత వెసులుబాటు..

యాపిల్ తీసుకొస్తున్న ఈ కొత్త టెక్నాలజీతో రిపేర్ టెక్నీషియన్లకు మరింత సులభతరం కానుంది. బ్యాటరీ రిప్లేస్ మెంట్ ప్రక్రియ చాలా వేగంగా, సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఐఫోన్ బ్యాటరీని మార్చడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ, దీనికి చాలా గంటల సమయం తీసుకుంటోంది. అందుకే దీనిని పరిహరించేందుకు యాపిల్ ఈ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కొత్త పద్దతిలో బ్యాటరీని రేకుకు బదులుగా మెటల్‌తో ఉంచుతున్నారు. ఇది ఎలక్ట్రికల్ జోల్ట్‌తో ఫోన్ ఛాసిస్ నుంచి తొలగించేందుకు వీలుగా అమర్చుతున్నారు.

ఐఫోన్ 16లో కొత్త టెక్నాలజీ..

ఈ ఏడాది చివరి నాటికి ఐఫోన్ 16లలోని కనీసం ఒక మోడల్‌లోనైనా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. అది విజయవంతమైతే 2025లో అన్ని ఐఫోన్ 17 మోడళ్లకు దీనిని విస్తరించే అవకాశం ఉంది. 2027 నాటికి పోర్టబుల్ డివైజ్ బ్యాటరీలను వినియోగదారులు లేదా స్వతంత్ర ఆపరేటర్‌లు సులభంగా తొలగించగలిగేలా, మార్చగలిగేలా ఉండాలని యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చిన కొత్త బ్యాటరీల నియంత్రణ నియమాలకు అనుగుణంగా యాపిల్ ఈ టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ నియంత్రణ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా తమ డిజైన్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది . ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్‌తో అధిక సాంద్రత కలిగిన బ్యాటరీని కలిగి ఉండవచ్చని పలువురు విశ్లేషకులు నివేదిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..