35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌.. ఇందులో మీ ఫోనుందా ??

యూజర్ల అవసరాలకు తగినట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు తీసుకురావడంతో పాటు తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లలో సేవలను నిలిపివేస్తుంటుంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరికొన్ని మోడల్‌ మొబైల్స్‌లో తన సేవల్ని ఆపేయనుంది. దీనికి సంబంధించిన కొత్త జాబితాను కెనాల్‌టెక్‌ (CanalTech) విడుదల చేసింది.

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌.. ఇందులో మీ ఫోనుందా ??

|

Updated on: Jul 01, 2024 | 8:27 PM

యూజర్ల అవసరాలకు తగినట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు తీసుకురావడంతో పాటు తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లలో సేవలను నిలిపివేస్తుంటుంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరికొన్ని మోడల్‌ మొబైల్స్‌లో తన సేవల్ని ఆపేయనుంది. దీనికి సంబంధించిన కొత్త జాబితాను కెనాల్‌టెక్‌ (CanalTech) విడుదల చేసింది. అందులో ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన 35 రకాల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ Ace ప్లస్‌, గెలాక్సీ కోర్‌, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్‌ 2, గెలాక్సీ గ్రాండ్‌, గెలాక్సీ నోట్‌ 3, గెలాక్సీ ఎస్‌3 మినీ, గెలాక్సీ ఎస్‌4 యాక్టివ్‌, గెలాక్సీ ఎస్‌4 మినీ, గెలాక్సీ ఎస్‌4 జూమ్‌. మోటో జీ, మోటో ఎక్స్‌, యాపిల్‌: ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ఎస్‌, ఐఫోన్‌ 6 ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ, హువావే: Ascend P6 S, Ascend G525, హువావే సీ199, హువావే జీఎక్స్‌1ఎస్‌, హువావే వై625, లెనోవా: లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్‌890, సోనీ: Xperia Z1, Xperia E3, ఎల్‌జీ: ఆప్టిమస్‌ 4ఎక్స్‌ హెచ్‌డీ, ఆప్టిమస్‌ జీ, ఆప్టిమస్‌ జీ ప్రో, ఆప్టిమస్‌ ఎల్‌7 ఫోన్లలో వాట్సప్‌ సదుపాయం రానున్న రోజుల్లో నిలిచిపోనుంది. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్లను వాడుతున్నట్లయితే కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్‌ సపోర్ట్‌ నిలిచిపోతే ఇకపై ఆయా ఫోన్లకు సందేశాలు నిలిచిపోతాయి. అంతేకాదు భద్రతా పరమైన సమస్యల్లో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. అదే అప్‌గ్రేడ్‌ అయితే మీ డేటా సురక్షితంగా ఉంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతీయుల్లో.. సగం మంది ఫిజికల్ గా అన్ ఫిట్.. ముందే హెచ్చరిస్తున్న లాన్సెట్ స్టడీ

వామ్మో.. ఇంతపెద్ద పుట్టగొడుగా !! ఎప్పుడూ చూసి ఉండరు

రీల్స్‌ కోసం టెర్రస్‌ పైకి వెళ్లిన బాలిక..రెప్పపాటులో ??

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

4 బెడ్రూమ్‌ ఫ్లాట్‌ ధర రూ.15 కోట్లు.. ఎక్కడంటే ??

Follow us